HomeUncategorizedHero Nagarjuna | ర‌ష్మిక సినిమాకు రూ.3 వేల కోట్ల కలెక్షన్లు.. మేం చేయ‌లేనిది ఈమె...

Hero Nagarjuna | ర‌ష్మిక సినిమాకు రూ.3 వేల కోట్ల కలెక్షన్లు.. మేం చేయ‌లేనిది ఈమె చేసి చూపించింద‌న్న నాగ్..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hero Nagarjuna | జూన్‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మ‌రో మూవీ సిద్ధ‌మైంది. ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న(Rashmika Mandanna) కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేర (Kubera). శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు నిర్మిస్తున్నారు. కుబేర మూవీ చాలా స్పెషల్ గా ఉంటుందని.. అందరూ ఎంజాయ్ చేస్తారని హీరోలు నాగార్జున, ధనుష్‌ అన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్​కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. జూన్ 20న సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మూవీలోని ‘పీ పీ డుమ్‌ డుమ్‌’ పాటని ముంబయిలో గ్రాండ్ గా లాంచ్ చేశారు.

Hero Nagarjuna | క్రేజీ కామెంట్స్..

ఈ కార్య‌క్ర‌మంలో లీడ్ యాక్టర్స్ అందరూ పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న Rashmika mandannaపై కొన్ని వైరల్ కామెంట్స్ చేశారు. రష్మిక ట్యాలెంట్ ఉన్న ఒక పవర్‌హౌస్ అని.. ఆమె గత చిత్రాలు పరిశీలిస్తే.. బాక్సాఫీస్ దగ్గర రూ.2000, రూ.3000 కోట్ల సినిమాలు చేసింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి ఫీట్ తనతో పాటు తన తోటి యాక్టర్స్ ఎవరూ చేయలేకపోయారని ఆయన అన్నారు. శేఖర్‌ కమ్ముల(Shekhar Kammula)తో 15ఏళ్లుగా పనిచేయాలనుకుంటున్నా. ఇప్పుడు కుదిరింది. ఇదొక డిఫరెంట్‌ సబ్జెక్ట్‌. కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా అంగీకరించా. ధనుష్‌(Hero Dhanush) ప్రతీ సినిమాలో వైవిధ్యం చూపిస్తుంటారు. ఈ మూవీలో ఆయన అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌ కనబరిచారు’ అన్నారు నాగ్.

రష్మికపై నాగ్ Nagarjuna చేసిన కామెంట్స్‌ను అభిమానుల నుంచి మిక్స్​డ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇక కుబేర చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తుండగా ఈ సినిమాను జూన్ 20న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. సాంగ్ లాంచ్ ఈవెంట్​లో హీరో ధనుష్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు చేయని పాత్రను ఈ మూవీలో చేశాను. సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ సినిమాను మేం ఛాలెంజింగ్​గా చేశాం అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. మేం చాలా సరదాగా చేసేశాం. ఇందులో నేను బెగ్గర్ పాత్ర చేశాను. దాని కోసం పెద్దగా రీసెర్చ్ చేయలేదు. శేఖర్ గారు ఎలా చెప్తే అలా చేసేశాను. ఆయన చాలా మంచి వ్యక్తి. అందరితో మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తారు. నాగార్జునతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను రష్మిక ఓ డంప్‌యార్డ్‌లో దాదాపు 7 గంటలపాటు షూటింగ్‌లో పాల్గొన్నాం అంటూ చెప్పుకొచ్చారు.