Nagamadugu Lift Irrigation Scheme
Nagamadugu Lift Irrigation Scheme |నాగమడుగు ఎత్తిపోతల పథకం పరిశీలన

అక్షరటుడే,నిజాంసాగర్: Nagamadugu Lift Irrigation Scheme | నిజాంసాగర్ మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని గురువారం క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్​మెంట్​ (Quality Control Department) హైదరాబాద్, నీటిపారుదల శాఖ (Irrigation Department) చీఫ్ ఇంజినీర్ అధికారులు పరిశీలించారు.

అనంతరం క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ వెంకటకృష్ణ, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్​ మాట్లాడుతూ వడ్డేపల్లిలో (Vaddepalli) కొనసాగుతున్న మొదటి దశ పంపు హౌస్ పనులు వేగవంతం చేయాలని గుత్తేదారులకు సూచించామన్నారు. పనులను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. వారి వెంట నీటిపారుదల శాఖ ఎస్​ఈ రాజశేఖర్, ఈఈ సోలోమన్, భూమారెడ్డి, డి శ్రవణ్ కుమార్ రెడ్డి, దత్తాత్రి, ఏఈ రాజ్ కమల్ ఉన్నారు.