అక్షరటుడే, వెబ్డెస్క్: Nagababu | నటుడు శివాజీ (Actor Shivaji) ఇటీవల దండోరా ప్రీ రీలిజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై ఇంకా విమర్శలు ఆగడం లేదు. మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పారు. అయినా కూడా శివాజీపై పలువురు విమర్శలు చేస్తున్నారు.
నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా శివాజీ వ్యాఖ్యలపై స్పందించారు. మోరల్ పోలీసింగ్ (Moral Policing) రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. మగ అహంకారంతో ఆడ పిల్లల వస్త్రధారణపై మాట్లాడుతున్నారని విమర్శించారు. వారిపై అలా మాట్లాడేందుకు ఏం హక్కుందని ప్రశ్నించారు. ప్రపంచంలో ఫ్యాషన్ రోజురోజుకి మారిపోతుంటుందన్నారు. ఒకప్పుడు తాను కూడా అలా ఆలోచించేవాడిని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆలోచన విధానాన్ని మార్చుకున్నట్లు తెలిపారు. మగవారితో సమానంగా ఆడపిల్లలను బతకనివ్వాలని ఆయన అన్నారు. ఆడవాళ్లు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలన్నారు.
Nagababu | తప్పు కాదు
పురుషాధిక్య ఆలోచనల నుంచి బయటకు రావాలని నాగబాబు సూచించారు. మోడ్రన్ దస్తులు (Modern Outfits) ధరించడం తప్పు కాదని చెప్పారు. మహిళలపై జరిగే అత్యాచారాలకు వారి దుస్తులు కారణం కాదని, మగవాళ్ల క్రూరత్వం కారణమని స్పష్టం చేశారు. తాను శివాజీని టార్గెట్ చేయడం లేదని, సమాజంలో ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నట్లు తెలిపారు. మహిళలు ఎలాంటి దుస్తులైనా ధరించాలన్నారు. కానీ బయటకు వెళ్లేటప్పుడు రక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నాగబాబు సూచించారు.