HomeUncategorizedPlane Crash | ఫ్లైట్ క్రాష్ ..ఆ రోజుల్లో చిరు, సుస్మిత విమాన ప్ర‌మాదం ఘ‌ట‌న‌ని...

Plane Crash | ఫ్లైట్ క్రాష్ ..ఆ రోజుల్లో చిరు, సుస్మిత విమాన ప్ర‌మాదం ఘ‌ట‌న‌ని గుర్తు చేసుకున్న నాగ‌బాబు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Plane Crash | అహ్మ‌దాబాద్ ఫ్లైట్ క్రాష్ Ahmadabad Flight Crash ఎంత మందిని క‌లిచి వేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాదాపు 250కి పైగా ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఈ ఘ‌ట‌న‌పై మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు చాలా ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. అహ్మ‌దాబాద్ ఫ్లైట్ క్రాష్ (Ahmedabad flight crash) తన మనస్సుని కలచి వేసిందని ఆయ‌న పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా చాలా ఏళ్ల క్రితం సోద‌రుడు చిరంజీవి, ఆయ‌న కూతురు సుస్మిత ఓ విమాన ప్ర‌మాదం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డ విష‌యాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. “అహ్మ‌దాబాద్ ఫ్లైట్ క్రాష్ నా మనస్సుని కలచి వేసింది. చాలా సంవత్సరాల క్రితం ఎంతో మంది ఫిల్మీ పర్సనాలిటీస్ ఉన్న చెన్నై ఫ్లైట్ తిరుపతిలో ఎక్కడో ల్యాండ్ అయ్యింది. అందులో మా అందరికీ అత్యంత ప్రియమైన మా అన్నయ్య చిరంజీవి, మా స్వీటీ(సుష్మిత) పాపా ఉన్నారు.”

Plane Crash | ఎమోష‌న‌ల్ కామెంట్స్..

ఫ్లైట్ తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయ్యిందంట మా అన్నయ్య hero Chiranjeevi మా స్వీటీ పాపా సేఫ్ గా ఉన్నారో లేదో అన్న ఆందోళన నా మనస్సు కలచివేసింది . అన్నయ్య, స్వీటీ పాపా సేఫ్, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు సేఫ్ అని తెలిశాక మనసు కుదుట పడింది. ఆ ఫ్లైట్ ప్ర‌మాదం ఎఫెక్ట్ ఈ రోజుకి నా మనసు లోంచి పోలేదు. అలాంటిది ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ క్రాష్(Flight Crash) గురించి విజువల్స్ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎంతమంది యువకులు వాళ్ల భ‌విష్య‌త్తు కోసం ఎన్నెన్ని ఆశలతో ఆ ఫ్లైట్ ఎక్కారో? ఎంతమంది పెద్ద వాళ్ళు వాళ్ల జీవిత చరమాంకంలో రిటైర్మెంట్ జీవితాన్ని అద్భుతంగా ఊహించుకొంటూ ఆ ఫ్లైట్ ఎక్కారో? ఏ తల్లి తన బిడ్డల దగ్గరకి చేరాలని ఆత్రంతో ఫ్లైట్ ఎక్కారో? ముక్కుపచ్చలారని పసిపాపలు ఈ లోకం ఒకటుందని తెలియక కేవలం తల్లి పొత్తిళ్లలో సేఫ్ గా ఉన్నామనుకొన్న పసి బిడ్డలు.. ప్రయాణీకులని సేఫ్ డెస్టినేషన్ కి చేర్పించి తన ఆత్మీయులతో గడపాలని ఊహల్లో ఉన్న పైలట్, కో పైలేట్ ఇతర క్రూ మెంబర్స్ కూడా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం.

అసలు ఈ ఫ్లైట్ తో సంబంధం లేని మెడికో స్టూడెంట్స్ హాస్టల్ (Medico Students Hostel) మెస్ రూంలో లంచ్ చేస్తుంటే పిడిగుపాటులా వాళ్ల‌ నెత్తిన పడి ప్రాణాలు తీసిన ఫ్లైట్. ఏ మెడికో బిడ్డ ఎన్ని ఆశలతో డాక్టర్స్ అవుదామని చదువుకుంటున్నారో వాళ్ల జీవితాలు వాళ్ళ మీద ఆ తల్లిదండ్రులు ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నారో.. ఏమనాలో? ఏమి ఆలోచించాలో? కూడా తెలియని నిస్తేజ స్థితి. ఇన్ని నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక ఫ్రాక్షన్ సెకండ్ లో ఇదంతా ఒక పీడకల అయితే ఎంత బాగుంటుంది అనిపించింది. దేవుడున్నాడని నమ్మే అన్ని మతాలవాళ్లు ఆ ఫ్లైట్ లో ఉండే వుంటారు. ఈ దేవుళ్ళు ఏమైపోయారు? ఎందుకు కాపాడలేకపోయారు? అనిపిస్తుంది. ఈ శతాబ్దానికి ఇంతకన్నా పెద్ద ఆపద రాదు, రాకూడదు కూడా. చనిపోయిన వాళ్ళకి కన్నీళ్ళతో బాధాతప్తా హృదయంతో, వారి ఆత్మ‌ల‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నా” అని నాగ‌బాబు Naga babu ట్వీట్ చేశారు.