HomeUncategorizedNaga Vamsi | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ చూశాక అంతా దాని గురించే చ‌ర్చ‌.. నిర్మాత...

Naga Vamsi | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ చూశాక అంతా దాని గురించే చ‌ర్చ‌.. నిర్మాత స్ట‌న్నింగ్ కామెంట్స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Naga Vamsi | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారిగా నటిస్తున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా ఎప్పుడెప్పుడు థియేట‌ర్స్‌లోకి వ‌స్తుందా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ 12న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం జూలై 24కు పోస్ట్ పోన్ అయింది. ఇక ఈ లోపు ఫ్యాన్స్‌ను ఉత్సాహ‌ప‌రిచేందుకు చిత్ర ట్రైలర్‌(Trailer)ను జూలై 3న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ట్రైలర్‌పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర ట్వీట్ చేశారు. “మీరు ఏం ఊహిస్తున్నారో నాకు తెలియదు.. కానీ జూలై 3న రండి, మీకో పెద్ద సర్​ప్రైజ్​ ఉంది! ట్రైలర్ అసాధారణంగా ఉంటుంది. దాని స్కేల్, మాడ్‌నెస్, పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎనర్జీ మీరు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుంది. మీరు దాన్ని ‘ఫీల్’ చేస్తారు.. ‘చర్చ’ చేస్తారు!” అని పేర్కొన్నారు.

Naga Vamsi | థ్రిల్ ఫీల‌వుతారు..

నాగ వంశీ(Producer Naga Vamsi) కామెంట్స్ త‌ర్వాత ట్రైల‌ర్‌పై అంచ‌నాలు ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలా అద‌ర‌గొట్టాడా అని ముచ్చ‌టించుకుంటున్నారు. ఇక హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇందులో పవన్ కల్యాణ్​ ఓ పోరాట యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నిధి అగర్వాల్(Heroine Nidhi Agarwal) కథానాయికగా నటిస్తుండగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి. చివరకు, మేకర్స్ జూలై 24న తొలి భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పిరియాడిక్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ అభిమానులే కాదు, అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తిని కలిగిస్తోంది.

మ‌రోవైపు నిర్మాత నాగ వంశీ.. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న కింగ్‌డ‌మ్ గురించి కూడా ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. గౌత‌మ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న‌ పోస్ట్‌ల‌ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు నాగ‌వంశీ. ‘కింగ్‌డ‌మ్‌కి సంబంధించి ఏ పోస్ట్ చేసిన అప్పుడ‌ప్పుడు ట్రోల్స్ వ‌స్తుంటాయ‌ని నాకు తెలుసు. న‌న్ము న‌మ్మండి. వెండితెర‌పై అద్భుతం చూపించేందుకు టీమ్ అంతా కృషి చేస్తుంది. సినిమా చూశాక మీకు క‌లిగే అనుభూతి మాములుగా ఉండ‌దు’ అని మూవీపై అంచ‌నాలు పెంచారు నాగ‌వంశీ.

Must Read
Related News