అక్షరటుడే, వెబ్డెస్క్: Nagababu | మెగా మదర్ అంజనా దేవి (Anjna Devi)కి ఆరోగ్యం బాలేదని, ఆమె హెల్త్ కండిషన్ సీరియస్ అని తెలియడంతో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హుటాహుటిన అమరావతి నుంచి హైదరాబాద్ సిటీకి ప్రయాణం అయినట్టు వార్తలు వచ్చాయి. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం(AP Cabinet meeting) అయ్యింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం హాజరయ్యారు. అయితే.. తల్లికి బాలేదని తెలియడంతో మీటింగ్ మధ్యలో నుంచి పవన్ హైదరాబాద్ బయలు దేరారంటూ అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేశాయి.
Nagababu | అంతా ఫేక్..
అంజనా దేవి అనారోగ్యానికి సంబంధించి నెట్టింట అనేక ప్రచారాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో నాగబాబు ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చారు.. అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రస్తుతం బాగానే ఉన్నారు అని తెలుపుతూ అంజనాదేవి ఆరోగ్యంపై వచ్చే వార్తలకు చెక్ పెట్టారు. అలాగే చిరంజీవి పీఆర్ టీమ్ స్పందిస్తూ.. చిరంజీవి (Chiranjeevi) తల్లికి సీరియస్ అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. చిరంజీవి షామీర్ పేట్లో షూటింగ్లో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) పర్సనల్ వర్క్ మీద హైదరాబాద్ వస్తున్నారు. దయచేసి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయవద్దు అని తెలిపారు.
అంజనా దేవికి ముగ్గురు కుమారులు కాగా, అందులో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కొడుకు. తొలుత ఆయన ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎటువంటి సినీ నేపథ్యం లేనప్పటికీ.. తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా ఓ వెలుగు వెలుగుతున్నారు. చిరంజీవి తర్వాత నాగబాబు, పవన్ కల్యాణ్, వాళ్ల సంతానం సైతం సినిమాల్లోకి వచ్చారు. పవన్ మినహా మిగతా అందరూ హైదరాబాద్ సిటీలో ఉన్నారు.