HomeUncategorizedNagababu | నిహారిక పెళ్లిపై నాగబాబు సెన్సేషనల్ స్టేట్‌మెంట్..

Nagababu | నిహారిక పెళ్లిపై నాగబాబు సెన్సేషనల్ స్టేట్‌మెంట్..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagababu | మెగా బ్ర‌దర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక (Niharika) వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తరువాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. దాంతో చైతన్యను (Chaitanya) ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో (husband Chaitanya) కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయింది. వివాహం అనంతరం పలు వివాదాల్లో చిక్కుకుంది నిహారిక. దీంతో తమ వైవాహిక బంధానికి అతి తక్కువ కాలంలోనే గుడ్ బై చెప్పింది. మెగా డాటర్ నిహారిక రెండో పెళ్లికి సంబంధించి నాగబాబు చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

Nagababu | వారి ఇష్టం..

తన మొదటి భర్తకు విడాకులు (Divorce) ఇచ్చిన నిహారిక ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి విషయమై నాగబాబు ఓపెన్ అయ్యారు. కూతురు విడాకులు తీసుకున్నాక ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ పెద్దగా స్పందించని నాగబాబు.. తొలిసారిగా దీనిపై స్పందించారు. నిహారిక (Niharika) తొలి వివాహం విఫలం కావడం.. ఆమె రెండో పెళ్లి చేసుకోవడం గురించి ఆయన మాట్లాడారు. తన కూతురు పెళ్లి విషయంలో తాము పొరపాటు చేశామని నాగబాబు అభిప్రాయపడ్డారు. నిహారిక, చైతన్యలను ప్రాపర్‌గా జడ్జ్ చేయలేకపోయామని ఆయన అన్నారు. పరస్పర అంగీకారంతోనే వాళ్లిద్దరూ విడిపోయారని.. ఇప్పుడిప్పుడే నిహారిక దాన్నుంచి తేరుకుంటోందని నాగబాబు అన్నారు.

ఇక వరుణ్ తేజ్ (Varun Tej) వచ్చి లావణ్యని (Lavanya) ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో ఆమెతో హ్యాపీగా ఉంటావా? భవిష్యత్తులో ఇబ్బందులు వస్తే ఏం చేస్తావ్ అని అడిగాను. ఆమెతో హ్యాపీగా ఉంటాను, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా చూసుకుంటానని చెప్పాడు. వాళ్లిద్దరూ ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారని నాగ‌బాబు అన్నారు. ప్ర‌స్తుతం నాగ‌బాబు కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.