అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anvesh Instagram Ban | ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ (YouTuber Naa Anveshana Anvesh)కు మెటా షాకిచ్చిన విషయం విదితమే. ఇటీవల అతను చేసిన కొన్ని వీడియోలు నెట్టింట తీవ్రదుమారం రేపాయి. దీంతో పలువురి ఫిర్యాదులు చేయడంతో పాటు వరుసగా నెటిజన్లు ఇన్‌స్టా ఐడీకి రిపోర్టు చేయడంతో మెటా ‘naa_anveshana5’ ఇన్‌స్టా అకౌంట్‌ను బ్యాన్ (Insta Account Ban) చేసింది. ఈ అంశం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా దీనిపై అన్వేష్ స్పందించాడు. మరో ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అకౌంట్ బ్లాక్ కావడంపై తన రియాక్షన్ తెలియపర్చాడు.
Anvesh Instagram Ban | నాకేం బాధలేదు..
ఇన్‌స్టా ఛానల్ పోయినందుకు నాకేం బాధ లేదని వీడియోలో పేర్కొన్నాడు. ‘రూపాయి రాని ఇన్‌స్టా అకౌంట్ ఉంటే ఏంటి పోతే ఏంటి. ఇన్ స్టా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ (YouTube channels) అనేవి నా రెండు చేతులు, రెండు కాళ్లు లాంటివి. ఫేస్ బుక్ అకౌంట్ నా బాడీతో సమానం. ఎన్ని అకౌంట్లు బ్యాన్ చేసినా వీడియోలు చేయడం ఆపేది లేదు. అన్నీ బ్యాన్ చేసినా.. వాటన్నింటినీ నడిపించే నా బుర్రని ఏం చేయలేరు’ అంటూ వ్యాఖ్యానించారు.
‘ఒక చెయ్యిని విరగ్గొడితే మరో చెయ్యి, రెండుకాళ్లతో ముందుకు వెళ్తాను. రెండో చెయ్యి పోతే రెండు కాళ్లున్నాయి. కాళ్లు కూడా తీసేస్తే బాడీతో పాక్కుంటూ వెళ్తాను. అది కూడా తీసేస్తే నా బుర్రే ఆయుధంగా పనిచేస్తుంది. ఎవరెన్ని చేసినా.. నా వీడియో ఆపను. 2026లో బత్తాయిలకు నరకం చూపిస్తాను. యూట్యూబ్ నుంచే నాకు లాస్ట్ మంత్ రూ.8 లక్షల ఇన్కమ్ వచ్చింది” అని అన్వేష్ తన వీడియోలో చెప్పుకొచ్చాడు.
View this post on Instagram