అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mysore Bharath | పహల్గామ్లో 26 మంది టూరిస్ట్‌లపై ఉగ్రదాడులు (Terrorist attacks) మతం పేరు కనుక్కొని మరీ దాడి చేయడం సంచలనం రేపింది. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) చేపట్టింది. వందమంది ఉగ్రదాడులని వేరేసినట్టు సమాచారం. అయితే భారత్ దాడి చేసిన కారణంగా పాకిస్తాన్ సైన్యం కూడా మనమీద దాడులకి దిగింది. అన్నింటిని భారత్ Indiaతిప్పి కొట్టింది. ఇక మే 10న భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆగింది. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి. అయితే పాకిస్తాన్‌కు చెందిన మూడు యుద్ధ విమానాలును భారత్ కూల్చివేసింది. పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16తో పాటు రెండు JF-17 యుద్ధ విమానాలను కూల్చేసింది.
10 పాక్ డ్రోన్లను S400తో పేల్చేసింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్(Pathankot Airbase)ను కూడా పాక్ టార్గెట్ చేసింది. మిసైల్స్, డ్రోన్లను మధ్యలోనే భారత్ నిర్వీర్యం చేసింది. యాంటీ మిస్సైల్ సిస్టమ్‌కి దొరక్కుండా.. పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగిస్తోంది. యాంటీడ్రోన్ సిస్టమ్‌తో పాక్ డ్రోన్లను కూల్చివేశారు. సాంబా సెక్టార్‌లోనూ పాక్ దాడులకు తెగబడగా, పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. యుద్ధ India-Pakistan War నేపథ్యంలో ప్రజల్లోనూ భావోద్వేగాలు పెరిగాయి. హైదరాబాద్‌లో కరాచీ బేకరీ Karachi Bakery చాలా పాపులర్. యుద్ధం నేపథ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పదేపదే కరాచీ బేకరీపై దాడి చేశారు.
అందుకు కారణం పేరులో కరాచీ(Karachi) ఉండడమే. పాకిస్తాన్‌లోని కరాచీ అనే పేరుతో హైదరాబాద్ Hyderabad లో బేకరీకి కరాచీ అనే పేరుండకూడదని బీజేపీ నేతలు రచ్చ చేశారు. ఇక పాక్‌కి సపోర్ట్ ఇచ్చిన టర్కీ , చైనాలకి సంబంధించిన పలు వస్తువులను బ్యాన్ చేయాలని సెలబ్రిటీలు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో పాక్, చైనా, టర్కీలని పూర్తిగా బ్యాన్ చేయాలని అంటున్నారు.
ఇక ఇదే క్రమంలో మైసూర్ పాక్‌లో పాక్ తీసేసి మైసూర్ భారత్(Mysore Bharath) అని పెట్టాలని కొత్త డిమాండ్ మొదలైంది. పాక్ అనే పేరు మన దేశంలో వినపడకూడదు అంటూ కొందరు నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. మైసూర్‌పాక్‌ను ఎంతో ఇష్టపడుతుంటారు. ఒక్కప్పుడు ప్రతి ఫంక్షన్లో ఇదే స్విట్ వడ్డించేవారంటే ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది. మైసూర్ పాక్ అనేది ప్రత్యేకమైన భారతీయ తీపి వంటకం. దీనికి ఎంతో విశిష్టత ఉంది. దీనిని ప్రధానంగా శనగపిండి, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు. చాలా మంది మైసూర్ పాక్‌ను లొట్టలేసుకుంటూ తింటుంటారు. ఏది ఏమైనప్పటికీ మైసూర్పాక్లో పాక్ తీసేయాలంటూ డిమాండ్ రావడం.. కాస్త ఫన్నీగా ఉన్నా కూడా భారతీయులలో భావోద్వేగాలు ఎంత ఉప్పొంగుతున్నాయో అర్ధమవుతుంది.