Myanmar earthquake | హిరోషిమా బాంబ్​తో పోల్చితే మయన్మార్​ భూకంప తీవ్రత 330 రెట్లు ఎక్కవట!
Myanmar earthquake | హిరోషిమా బాంబ్​తో పోల్చితే మయన్మార్​ భూకంప తీవ్రత 330 రెట్లు ఎక్కవట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Myanmar earthquake : గత నెలలో మయన్మార్‌ను కుదిపేసిన ఘోర భూకంపం అనంతరం పరిస్థితి ఇప్పటికీ దారుణంగానే ఉంది. ఆసియన్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ సెంటర్ (AHA) నివేదిక ప్రకారం.. దాదాపు 2 లక్షల మంది తమ నివాసాలను వదిలిపెట్టాల్సి వచ్చింది. వీరిలో ఇంకా 42,000 మంది తాత్కాలిక క్యాంపుల్లోనే ఉంటున్నారు.

బంగ్లాదేశ్‌ Bangladesh లోని జహంగీర్‌నగర్ యూనివర్సిటీ Jahangirnagar University లో భూభౌతిక శాస్త్ర నిపుణులు డాక్టర్ ఎమ్.డి. శకావత్ హొసెయిన్ ఈ భూకంప తీవ్రతను విశ్లేషించారు. ” భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. భూమిలో కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉత్పన్నమవడం, నాయ్‌పీటా, మాండలే వంటి నగరాలకు దగ్గరగా ఉండటం వల్ల వినాశనం ఎక్కువగా ఉంది. ఇది హిరోషిమా బాంబింగ్‌తో పోల్చితే 330 రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసింది” అని చెప్పారు.

Myanmar earthquake : తాత్కాలిక శిబిరాల్లోనే అనేక మంది

Myanmar earthquake | హిరోషిమా బాంబ్​తో పోల్చితే మయన్మార్​ భూకంప తీవ్రత 330 రెట్లు ఎక్కవట!
Myanmar earthquake | హిరోషిమా బాంబ్​తో పోల్చితే మయన్మార్​ భూకంప తీవ్రత 330 రెట్లు ఎక్కవట!

భూకంపం కారణంగా ప్రజలు తినడానికి ఆహారం, తాగడానికి నీరు లేక ఇప్పటికీ తీవ్ర కష్టాలు పడుతున్నారు. వర్షాలు, గాలివానలతో కూడిన వాతావరణానికి తట్టుకోలేని తాత్కాలిక శిబిరాల్లో మహిళలు, చిన్నారులు దయనీయ స్థితిలో ఉంటున్నారు.

Myanmar earthquake : పిల్లల్లో పోషకాహార లోపం

Myanmar earthquake | హిరోషిమా బాంబ్​తో పోల్చితే మయన్మార్​ భూకంప తీవ్రత 330 రెట్లు ఎక్కవట!
Myanmar earthquake | హిరోషిమా బాంబ్​తో పోల్చితే మయన్మార్​ భూకంప తీవ్రత 330 రెట్లు ఎక్కవట!

ఆసియన్ ఆపత్కాల బృందాలు 72 గంటల్లోగా మయన్మార్​కు చేరుకున్నాయి. భారత్, చైనా, యూఎస్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్ సహా చాలా దేశాలు సహాయం అందించాయి. కాగా, అంతర్జాతీయ రెడ్ క్రాస్ సమాఖ్యను (International Federation of the Red Cross) $ 100 మిలియన్ల సాయం కోరినప్పటికీ, కొద్ది మొత్తం మాత్రమే వచ్చింది. యునైటెడ్ నేషన్స్ ప్రకారం, 4.3 మిలియన్ల మందికి తాగునీరు, శౌచాలయాలు లభించడం లేదు. ఆహార కొరత కారణంగా పిల్లలలో పోషకాహార లోపం పెరుగుతోంది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో, రక్షణ వసతులు అత్యంత అవసరంగా మారాయి.

Myanmar earthquake : భవిష్యత్తు ప్రమాదాలకు సిద్ధంగా ఉండాలి

ఏప్రిల్ 29 వరకు అందిన సమాచారం ప్రకారం.. మయన్మార్​ భూకంపంలో 3,798 మంది ప్రాణాలు కోల్పోయారు. 5,106 మంది గాయపడ్డారు. 106 మంది ఆచూకీ ఇంకా లభించడం లేదు. భవిష్యత్తులో మరిన్ని భూకంపాల ప్రమాదం ఉందనేది నిపుణుల హెచ్చరిక. “ఈ ప్రాంతం అనేక చురుకైన భూకంప రేఖల మధ్య ఉంది. సాగాంగ్ ఫాల్ట్, డౌకి ఫాల్ట్, మేన్ ఫ్రంటల్ థ్రస్ట్ Sagang Fault, the Dauki Fault, Main Frontal Thrust తరచుగా ప్రకంపనలకు గురవుతున్నాయి,” అని హొసెయిన్ తెలిపారు.