అక్షరటుడే, వెబ్డెస్క్: Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాలకు దు:ఖాన్ని మిగిల్చింది. విమానం కూలిపోయిన ఘటనలో ప్రయాణికులు(Passengers), విమాన సిబ్బంది(flight Staff) 241 మంది మరణించారు. విమానంలోని ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్(BJ Medical College Hostel)పై పడడంతో పలువురు వైద్య కాలేజీ విద్యార్థులు చనిపోయారు. 24 మంది మెడికోలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత తన తల్లి, కుమార్తె కనిపించడం లేదని హాస్టల్లో పని చేసే వ్యక్తి చెప్పాడు.
ఠాకూర్ రవి అనే వ్యక్తి బీజే మెడికల్ కాలేజీ యూజీ మెస్(UG Mess)లో పని చేస్తాడు. కుటుంబంతో సహా అక్కడే ఉంటారు. ఈ క్రమంలో విద్యార్థులకు వంట చేసిన ఆయన డాక్టర్ల కోసం టిఫిన్ బాక్సులు(Doctors Tiffin boxes) తీసుకొని సివిల్ హాస్పిటల్ వెళ్లాడు. ఆ సమయంలోనే విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి నుంచి తన తల్లి సరళాబెన్ ప్రహ్లాదీ ఠాకూర్, తన కుమార్తె ఆద్యారవి ఠాకూర్ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మెస్, హాస్పిటల్ పరిసరాల్లో వెతికినా ఇంత వరకు ఆచూకీ దొరకలేదని వాపోయాడు.