ePaper
More
    HomeతెలంగాణToy Helicopter | నా హెలికాప్టర్​ పనిచేయడం లేదు.. పోలీసులకు బుడ్డోడి ఫిర్యాదు

    Toy Helicopter | నా హెలికాప్టర్​ పనిచేయడం లేదు.. పోలీసులకు బుడ్డోడి ఫిర్యాదు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Toy Helicopter | ఏదైనా వస్తువు కొన్న తర్వాత అది పనిచేయకుంటే సాధారణంగా పిల్లలు children దిగాలు పడుతుంటారు. ఏడుస్తుంటారు. కానీ ఆ బుడ్డోడు చేసిన పనికి హాట్సాఫ్​ అనకతప్పదు.

    ఓ పదేళ్ల బాలుడు ten-year-old boy తాను కొన్న బొమ్మ హెలికాప్టర్‌ Toy Helicopter పనిచేయకపోవడంతో, వ్యాపారిపై చర్యలు తీసుకోవాలంటూ ధైర్యంగా పోలీసులను police ఆశ్రయించాడు.

    కర్ణాటకలోని Karnataka state బర్మానాగన్‌పల్లికి Burmanaganpally చెందిన ఓ కుటుంబం.. సిద్దేశ్వర Siddeshwara జాతర ఉత్సవాల కోసం సంగారెడ్డి జిల్లా Sangareddy district కంగ్టిలోని పుట్టింటికి వచ్చింది. ఈ కుటుంబానికి చెందిన వీరారెడ్డి (10) జాతరలో ఓ చిరువ్యాపారి వద్ద రూ. మూడు వందలకు three hundred  బొమ్మ హెలికాప్టర్‌ను toy helicopter ఖరీదు చేశాడు. ఇంటికి తీసుకొచ్చాక అది పని చేయలేదు.

    దీంతో దానిని తీసుకెళ్లి వ్యాపారికి trader ఇచ్చేసి వేరేది తీసుకొచ్చాడు. అది కూడా పనిచేయలేదు. ఇలా మూడు, నాలుగు సార్లు మార్చినా ఫలితం లేకపోవడంతో ఆ బాలుడు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు police station వెళ్లాడు. తనను మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతూ వీరారెడ్డి Veera Reddy ఫిర్యాదు చేశాడు.

    పోలీసులు police బాలుడి కుటుంబానికి family సమాచారం అందించారు. దీంతో వీరారెడ్డి Veera Reddy తాత పోలీసులతో police మాట్లాడారు. తన మనవడు గతంలో తనతో పాటు ఠాణాకు వచ్చాడని, అదే ధైర్యంతో ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. చివరికి బాలుడిని పోలీసులు police సముదాయించి ఇంటికి పంపించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...