ePaper
More
    HomeతెలంగాణKonda Surekha | నా కూతురిలో రాజకీయ రక్తం ప్రవహిస్తోంది.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

    Konda Surekha | నా కూతురిలో రాజకీయ రక్తం ప్రవహిస్తోంది.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Surekha | తమ కూతురిలో కూడా రాజకీయ రక్తం (political blood) ప్రవహిస్తోందని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొండా మురళి, కొండా సురేఖ దంపతుల తీరుతో వరంగల్​ కాంగ్రెస్​లో (Warangal Congress) రాజకీయాలు హీట్​ ఎక్కిన విషయం తెలిసిందే. ఇటీవల కొండా దంపతులు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

    సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే వారు వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. దీంతో ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని (Warangal district) కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, నేతలు కొండా దంపతులకు వ్యతిరేకంగా ఏకం అయ్యారు. ఈ మేరకు మీనాక్షి నటరాజన్​కు (Meenakshi Natarajan) ఫిర్యాదు చేశారు. ఇటీవల కొండా మురళి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తాజాగా గురువారం ఉదయం కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​తో భేటీ అయ్యారు.

    READ ALSO  ACB Raids | ఏసీబీ దూకుడు.. లంచావ‌తారుల‌కు చుక్క‌లు.. రూ.వంద‌ల కోట్ల అక్ర‌మాలు బ‌య‌ట‌కు..

    Konda Surekha | ఆరోపణలపై వివరణ

    మీనాక్షి నటరాజన్‌తో (Meenakshi Natarajan) కొండా దంపతులు భేటీ అయి తమపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్​కు అన్ని వివరించామన్నారు. స్థానిక ఎన్నికల్లో (local elections) ఉమ్మడి వరంగల్​ జిల్లాలో పార్టీ (joint Warangal district) అన్ని స్థానాలు గెలుచుకునేలా కృషి చేస్తానని చెప్పారు. రాహుల్‌ను ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు.

    Konda Surekha | కూతురు రాజకీయ ఎంట్రీపై..

    కొండా మురళి తమ కుమార్తె పరకాల నుంచి పోటీ చేస్తుందని గతంలో వ్యాఖ్యానించారు. ఇటీవల ఆయన కుతురు సుష్మిత పటేల్​ (Sushmita Patel) సైతం పరకాలలో పోటీ చేయబోతున్నట్లు సోషల్​ మీడియాలో ప్రకటించారు. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్​ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి (MLA Revuri Prakash Reddy) ఉన్నారు. ప్రకాశ్​రెడ్డిని తామే గెలిపించామని మురళి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా తమ కూతురు పోటీపై మురళి స్పందించారు. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) మాట్లాడుతూ.. తమలో రాజకీయ రక్తం, సేవ గుణం ఉన్నాయని పేర్కొన్నారు. తమ కూతురులో అవే వారసత్వంగా వచ్చాయన్నారు. దీంతో ఆమె పరకాలలో పోటీ చేస్తున్నట్లు చెప్పి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఆమె ఆలోచనలను కాదనే అధికారం తమకు లేదన్నారు.

    READ ALSO  Heavy rain | వరదలో చిక్కుకున్న ఉద్యోగులు.. బోట్ల సాయంతో బయటకు..

    Latest articles

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth...

    IND vs ENG | బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో బెంబేలెత్తించిన ఇంగ్లండ్‌.. భార‌త బౌలర్స్ బేజార్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : మాంచెస్ట‌ర్ టెస్ట్ మ్యాచ్‌ (Manchester Test match) లో ఇంగ్లండ్...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. గురువారం సెషన్‌లో యూఎస్‌,...

    More like this

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth...

    IND vs ENG | బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో బెంబేలెత్తించిన ఇంగ్లండ్‌.. భార‌త బౌలర్స్ బేజార్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : మాంచెస్ట‌ర్ టెస్ట్ మ్యాచ్‌ (Manchester Test match) లో ఇంగ్లండ్...