అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Akshay Kumar | ఆన్‌లైన్ గేమ్స్ (Online Games) విషయంలో బాలీవుడ్ (Bollywood) హీరో అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడే పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
తన కుమార్తె విషయంలో జరిగిన అనుభవాన్ని అక్షయ్‌కుమార్ పంచుకున్నారు. ‘సైబర్ (Cyber) అవేర్‌నెస్ మంత్ 2025’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తన కుమార్తె కొన్ని రోజుల క్రితం ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండగా.. ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నట్లు చెప్పాడు. మొదట చాలా మర్యాదగా సదరు వ్యక్తి మెసెజ్‌లు పంపడన్నారు. ‘గేమ్ బాగా ఆడుతున్నావ్’, ‘చాలా బాగా ఆడావ్’ అంటూ పొగడ్తలతో మెసేజ్‌లు పంపాడని తెలిపారు. తర్వాత సదరు వ్యక్తి తన కూతురిని అమ్మాయా.. అబ్బాయా అని అడిగాడన్నారు. జెండర్ చెప్పగానే ఆ వ్యక్తి న్యూడ్ పిక్చర్ పంపగలవా అని మెసేజ్ చేశాడన్నారు. దీంతో వెంటనే గేమ్ బంద్ చేసి తన కూతురు ఆ విషయాన్ని తల్లికి చెప్పిందన్నారు. ఆమె అలా చెప్పడం చాలా మంచిదైందని పేర్కొన్నారు.
Akshay Kumar | అందరి సమస్య
ఇలా అమ్మాయిలను వేధించడం తన కుమార్తె సమస్య కాదని అక్షయ్ కుమార్ అన్నారు. ఇలాంటి సైబర్ నేరాల బారిన పడి ఎంతోమంది బాలికలు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. కొంత మంది అమ్మాయిలు వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఇతర నేరాల కన్న సైబర్ నేరాలు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.