Homeజిల్లాలునిజామాబాద్​Science Seminar | రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్​లో రాణించాలి

Science Seminar | రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్​లో రాణించాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Science Seminar | రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్​లో రాణించాలని డీఈవో అశోక్ (DEO Ashok) అన్నారు. జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ ముగింపు కార్యక్రమాన్ని నగరంలోని హరిచరణ్ హిందీ విద్యాలయంలో (Haricharan Hindi School) శుక్రవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. “క్వాంటం లైఫ్ బిగిన్స్ ప్రాస్పెక్స్ అండ్ ఛాలెంజెస్” అనే అంశంలో అన్ని మండలాల విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు.

అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని ఆర్తిని (మెండోరా, జెడ్పీహెచ్ఎస్) అభినందించారు. అలాగే అన్ని మండలాల్లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, ఎంఈవో సాయిరెడ్డి, పీఆర్​టీయూ తెలంగాణ గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్, జ్యూరీ మెంబర్లు నరేష్, గోపి వేణుగోపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News