అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Court | న్యాయసేవలపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ (Yella Reddy Munsif Court) మధుమంచి, ఎస్ఐ మహేష్ పేర్కొన్నారు. జాతీయ న్యాయసేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్లో(SC Welfare Girls Hostel) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలన్నారు.
అలాగే న్యాయసేవాధికార సంస్థ(Legal Services Authority) ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలనే విషయాలను అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా మహిళలు, విద్యార్థినులు, సామాజికంగా వెనుకబడిన వర్గాలు తమ హక్కులను తెలుసుకొని న్యాయం పొందేందుకు అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
న్యాయ సేవల హక్కులు, సైబర్ క్రైం, చట్టపరమైన రక్షణ చర్యలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో అడ్వకేట్ పద్మ పండరి, హాస్టల్ వార్డెన్ శారద, లింగమయ్య, న్యాయ సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
