అక్షరటుడే, హైదరాబాద్: Muslim owns laddu : గణేశ్ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర Ganesh Shobhayatra నిర్వహిస్తున్నారు.
మరోవైపు ఆయా మండపాల్లో లంబోధరుడి లడ్డూ Lambodhar’s Laddu వేలం auction కొనసాగుతోంది. రూ. లక్షలు పెట్టడానికి కూడా భక్తులు వెనుకాడటం లేదు.
నవరాత్రులు Navratri పూజలు అందుకున్న లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. వినాయకుడి లడ్డూను దక్కించుకునే మంచి జరుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది.
Muslim owns laddu | మత సామరస్యానికి ప్రతీక..
వినాయకుడి పూజల్లోనే కాదు.. లడ్డూ వేలంలోనూ ముస్లిం భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ ముస్లిం భక్తికి మతం లేదంటూ నిరూపించారు.
బోరబండలో ముస్లిం వ్యక్తి లడ్డూ వేలంలో పాల్గొని అందరినీ ఆకర్షించారు. రాజ్‌నగర్‌లోని కింగ్స్ టీమ్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపంలో లడ్డూ వేలం నిర్వహించారు.
కాగా, సయ్యద్ హమాన్ రసూల్ అనే రియల్టర్ వేలంలో పాటలో చురుకుగా పాల్గొన్నారు. వేలం పాటలో ముందుంటూ చివరికి రూ. 55 వేలకు వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు.
సయ్యద్ హమాన్ రసూల్ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. రసూల్ గతంలోనూ ఇలానే వేలం పాటలో పాల్గొని గణేశుడి లడ్డూను సొంతం చేసుకున్నారు.