HomeUncategorizedNvidia CEO | అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపారిగా మ‌స్క్‌.. రెండో స్థానంలో ఎన్విడియా చీఫ్‌..

Nvidia CEO | అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపారిగా మ‌స్క్‌.. రెండో స్థానంలో ఎన్విడియా చీఫ్‌..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nvidia CEO | ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపార‌వేత్త‌ల్లో ఎలాన్ మ‌స్క్(Elon Musk) మొద‌టి స్థానంలో నిలిచారు. అంతరిక్ష అన్వేషణ, ఎలక్ట్రిక్ వాహనాల విక్ర‌యాల్లో అద్భుత‌మైన విజ‌యాలు సాధించిన మస్క్ అగ్రస్థానాన్ని ద‌క్కించుకున్నారు. ఆయ‌న త‌ర్వాతి స్థానంలో ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్(Nvidia CEO Jensen Huang) నిలిచారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో కీల‌క‌మైన చిప్స్ రూప‌క‌ల్ప‌న‌లో ఎన్విడియా సంస్థ ప్ర‌పంచంలోనే అత్యంత గొప్ప సంస్థ‌గా ఎదిగింది. ఈ జాబితాలో ఇండియా నుంచి ముఖేశ్ అంబానీకి ఒక్కరికే స్థానం ద‌క్కింది. వివిధ వ్యాపారాల్లో త‌న‌దైన ముద్ర వేసిన రిల‌య‌న్స్ అధినేత.. ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపారుల జాబితాలో 12వ స్థానంలో నిలిచారు.

Nvidia CEO | ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసించే స్థాయికి..

2024లో వ్యాపార రంగంలో ప్ర‌పంచంలోనే అత్యంత శక్తివంతమైన 10 మంది వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ ఇటీవ‌ల విడుద‌ల చేసింది. వ్యాపార వృద్ధిలో తమ దార్శనిక నాయకత్వం, ఆవిష్కరణలు, వ్యూహాత్మక నిర్ణయాల ద్వారా పరిశ్రమలు. ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి బాట ప‌ట్టించిన ప్ర‌పంచ స్థాయి వ్యాపార‌వేత్త‌లకు ఇందులో చోటు ద‌క్కింది. ఈ ప్రభావవంతమైన నాయకులు ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలను నడిపిస్తున్నారు. స్థానిక, ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేసే స్థాయిలో కొన‌సాగుతున్నారు. ఈ జాబితా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెల్ల(Microsoft CEO Satya Nadella), బెర్క్‌షైర్ హాత్వే అధిప‌తి వారెన్ బఫెట్, జనరల్ మోటార్స్ మేరీ బార్రా వంటి ప్రభావవంతమైన వారికి చోటు ద‌క్కింది.

Nvidia CEO | శక్తివంతమైన వ్యాపార నాయకులు

త‌మ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు, స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ప్ర‌పంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన పారిశ్రామిక వేత్త‌లు విశ్వ విప‌ణిపై త‌మ‌దైన ముద్ర వేశారు. ఇందులో టెస్లా సీఈవో మస్క్(Tesla CEO Musk) మొద‌టి స్తానంలో నిలువ‌గా, ఎన్వీడియా ఫౌండ‌ర్ జెన్సన్ హువాంగ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. బెర్క్‌షేర్ హాత్వే సంస్థ చైర్మ‌న్ వారెన్ బఫెట్, జేపీ మోర్గాన్ చైర్మ‌న్ అండ్ సీఈవో జామీ డిమోన్‌, ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌, మెటా వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌, ఏపెన్ ఏఐ సీఈవో సామ్ శాల్ట్‌మ‌న్‌, జ‌న‌ర‌ల్ మోటార్స్ చైర్ ప‌ర్స‌న్ మేరీ బార్రా, గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ టాప్ 10 జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు. వివిధ వ్యాపారాల్లో రాణిస్తున్న రిల‌య‌న్స్ అధినేత ముఖేశ్ అంబానీ(Reliance Chairman Mukesh Ambani)కి 12వ స్థానం ల‌భించింది. టాప్ 15లో ఆయ‌న ఒక్క‌రే ఇండియా నుంచి చోటు ద‌క్కించుకున్న వ్య‌క్తి.