ePaper
More
    HomeసినిమాMuruga Book | ఎన్టీఆర్ చేతిలో మురుగ‌న్ పుస్త‌కం.. ఆ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వ‌చ్చిన‌ట్టేనా?

    Muruga Book | ఎన్టీఆర్ చేతిలో మురుగ‌న్ పుస్త‌కం.. ఆ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వ‌చ్చిన‌ట్టేనా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Muruga Book | పురాణ పురుషుల పాత్రలు పోషించేటప్పుడు న‌టీన‌టులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటారు. ఆ పాత్ర గుర్తించి పూర్తిగా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. త‌మ‌కు తెలియ‌ని విష‌యాల‌ను పూర్తిగా తెలుసుకుంటే ఆ పాత్రలో అంతగా ఒదిగిపోవచ్చని వారి న‌మ్మకం. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ చేతిలో ‘మురుగ’ పుస్త‌కం(Muruga Book )తో ద‌ర్శ‌న‌మివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే డైరెక్టర్​ ప్ర‌శాంత్ నీల్‌(Director Prashant Neel)తో “డ్రాగ‌న్” అనే ప్రాజెక్ట్‌ను చేయ‌డంతో పాటు, బాలీవుడ్ సినిమా “వార్ 2” కూడా చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగ‌స్టు 14న విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

    Muruga Book | సినిమా కోస‌మేనా?

    ఈ సందర్భంలో, ముంబై నుండి హైదరాబాద్‌కు చ‌క్క‌ర్లు కొడుతున్నారు ఎన్టీఆర్(Jr.NTR). అయితే ముంబై ఎయిర్‌పోర్టు(Mumbai Airport)లో ఓ పుస్తకం పట్టుకుని నడుస్తున్న ఎన్టీఆర్ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ పుస్తకం ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం రాసిన “మురుగ: ది లార్డ్ ఆఫ్ వార్, ది గాడ్ ఆఫ్ విస్డమ్” (Muruga: The Lord of War, The God of Wisdom). తార‌క్ త‌న త‌దుప‌రి చిత్రం త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోతున్న నేప‌థ్యంలో ఆ సినిమా కోసం ఇప్ప‌టి నుండే కుమార‌స్వామి గురించి తెలుసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్టు అర్థమవుతోంది.

    ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్(Trivikram) సినిమా మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని సమాచారం. అటువంటి నేపథ్యంలో, “మురుగ” క‌థపై ఆసక్తి చూపుతున్నాడ‌ని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగ‌న్ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. ఇటీవల ‘డ్రాగన్'(Dragon) కొంతభాగం షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్ NTR .. ఆ చిత్రానికి స్మాల్ బ్రేక్ ఇచ్చి.. వార్-2 సాంగ్ షూట్ కోసం ముంబై వెళ్లారు. ఈ క్ర‌మంలో ముంబై ఎయిర్ పోర్టులో జూనియర్​ ఎన్టీఆర్ చేతిలో ఆనంద్ బాలసుబ్రమణియన్(Anand Balasubramanian) రాసిన ‘మురుగ’ పుస్తకం దర్శనమిచ్చింది. ఇంకేముంది త్రివిక్ర‌మ్ సినిమా కోస‌మే ఎన్టీఆర్ ఈ బుక్ చ‌దువుతున్నాడ‌ని ముచ్చ‌టించుకుంటున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...