ePaper
More
    HomeజాతీయంBengal CM | బీజేపీ, బీఎస్ఎఫ్ వల్లే ముర్షిదాబాద్ అల్లర్లు..

    Bengal CM | బీజేపీ, బీఎస్ఎఫ్ వల్లే ముర్షిదాబాద్ అల్లర్లు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bengal CM | పశ్చిమబెంగాల్లోని West Bengal ముర్షిదాబాద్ లో Murshidabad ఇటీవల జరిగిన అల్లర్లు పక్కా ప్రణాళికా ప్రకారమే జరిగాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ Bengal CM Mamata Banerjee వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీతో పాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ Border Security Force (బీఎస్ఎఫ్) వల్లే అల్లర్లు జరిగాయని ఆరోపించారు. ముర్షిదాబాద్ లో ఘర్షణలు చెలరేగిన ప్రాంతాన్ని మమత సోమవారం సందర్శించారు. బాధితులతో మాట్లాడిన అనంతరం ఆమె కేంద్ర ప్రభుత్వంపై central government విమర్శలు ఎక్కుపెట్టారు. కొందరు కావాలనే “మతపరమైన ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారు” అని ఆరోపించారు.

    Bengal CM | కాల్పులు జరపడం వల్లే..

    ముర్షిదాబాద్ లో Murshidabad భద్రతా దళాలు security forces కాల్పులు జరపకుండా ఉంటే అల్లర్లు జరిగేవి కాదని దీదీ అన్నారు. ప్రణాళికాబద్ధంగానే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. “బీఎస్ఎఫ్ BSF కాల్పులు ఎందుకు జరిపింది? బీఎస్ఎఫ్ BSF కాల్పులు జరపకపోతే ఆ సంఘటన మరుసటి రోజు చెలరేగేది కాదు.. మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే బదులు సరిహద్దులను borders జాగ్రత్తగా చూసుకోండి అని నేను బీజేపీకి BJP చెప్పాలనుకుంటున్నాను.. మీరు కుర్చీలో ఉన్నప్పుడు ప్రజలను విభజించలేరు. నేను బాధితులను కలవడానికి వచ్చాను కానీ వారిని ఎందుకు రహస్యంగా secretly తీసుకెళ్లారు. ఇందులో ఏదో కుట్ర ఉంది” అని దీదీ వ్యాఖ్యానించారు. తనకు అన్ని మతాలు religions సమానమేనని తెలిపారు.

    Bengal CM | మహిళా కమిషన్ పై ఆగ్రహం

    జాతీయ మహిళా కమిషన్ పై National Commission for Women దీదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ముర్షిదాబాద్ లో Murshidabad అల్లర్లు చెలరేగిన తర్వాతి రోజే ఇక్కడకు వచ్చారన్న మమత.. మరి మణిపూర్ Manipur, యూపీ UP, రాజస్థాన్ Rajasthan కూడా అంత వేగంగా ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. “ఈ సంఘటనను ప్రణాళిక ప్రకారమే చేశారు. హింసను రెచ్చగొట్టిన వారిని బెంగాల్ bengal ఎప్పటికీ సహించదు. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు అల్లర్లకు వ్యతిరేకం. జగన్నాథ్ ధామ్ Jagannath Dham విషయంలో వారు ఎందుకు అంతగా ఆందోళన చెందుతున్నారు? ఒడిశా, మహారాష్ట్రలో Odisha and Maharashtra బెంగాలీ మాట్లాడినందుకు ప్రజలను కొడుతున్నారు” అని మమత పేర్కొన్నారు.

    ముర్షిదాబాద్ Murshidabad అల్లర్ల బాధిత కుటుంబాలను బీజేపీ BJP తీసుకెళ్లిందని, దీంతో బాధితులను కలవలేక పోయానని తెలిపారు. ఇది కిడ్నాప్ కాదా? నేను వారిని ఇక్కడ కలుసుకుని చెక్కులు cheques అందజేసి ఉంటే ఏమి హాని జరిగి ఉండేదని ప్రశ్నించారు. మత హింసను communal violence ప్రేరేపించే బదులు మన సరిహద్దులను రక్షించడానికి ప్రయత్నాలు చేయండని కేంద్రానికి సూచించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ పైనా National Human Rights Commission మమత విమర్శలు గుప్పించారు. హక్కుల కమిషన్ సభ్యులు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ Uttar Pradesh, ప్రస్తుతం రాష్ట్రపతి President పాలనలో మణిపూర్ Manipur సందర్శించారా? అని ప్రశ్నించారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...