Homeఆంధప్రదేశ్Mayor Murder Case | మాజీ మేయర్​ దంపతుల హత్య.. ఐదుగురికి ఉరిశిక్ష విధించిన కోర్టు

Mayor Murder Case | మాజీ మేయర్​ దంపతుల హత్య.. ఐదుగురికి ఉరిశిక్ష విధించిన కోర్టు

చిత్తూరు మాజీ మేయర్​ దంపతుల హత్య కేసులో దోషులకు కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ మేరకు చిత్తూరు కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mayor Murder Case | చిత్తూరు (Chittoor)లో సంచలనం సృష్టించిన మాజీ మేయర్​ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు నిందితులకు చిత్తూరు కోర్టు (Chittoor Court) శుక్రవారం ఉరి శిక్ష విధించింది.

చిత్తూరు దివంగత మేయర్‌ కఠారి అనురాధ (Mayor Kathari Anuradha), ఆమె భర్త కఠారి మోహన్‌ నగర పాలక సంస్థ కార్యాలయంలోనే హత్యకు గురయ్యారు. 2015 నవంబర్​ 17 వారికి కొందరు దుండగులు వారిపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ జంట హత్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూ(46)తో పాటు 23 మంది నిందితులను గుర్తించారు. ఇందులో ఏ21 ఎస్‌ శ్రీనివాసచారి మృతి చెందారు. ఏ 22 రమేశ్​ను గతంలోనే కేసు నుంచి తొలగించింది.

మిగిలిన 21 మంది నిందితుల్లో 16 మందిపై ఇటీవల న్యాయస్థానం కేసు కొట్టివేసింది. ఐదుగురిపై నేరం రుజువైనట్లు గతంలోనే ప్రకటించింది. దోషులు చంద్రశేఖర్‌ (చింటూ), వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ, వెంకటేష్‌కు ఉరి శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

Mayor Murder Case | సుదీర్ఘంగా వాదనలు

ఈ కేసులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. గురువారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తీర్పు ప్రకటించారు. కాగా ఉరిశిక్ష పడిన చింటూ మాజీ మేయర్​కు బంధువు కావడం గమనార్హం. చింటూ అనురాధ భర్త మోహన్​ (Kathari Mohan) మేనల్లుడు. అతడిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. పదేళ్లలో దాదాపు 122 మంది సాక్షులను విచారించిన కోర్టు నిందితులకు ఉరి శిక్ష ఖరారు చేసింది.