Homeఆంధప్రదేశ్Satya Sai District | దృశ్యం సినిమా తరహాలో హత్య.. రెండేళ్లకు వీడిన మిస్టరీ

Satya Sai District | దృశ్యం సినిమా తరహాలో హత్య.. రెండేళ్లకు వీడిన మిస్టరీ

ఆంధ్రప్రదేశ్​లోని సత్యసాయి జిల్లాలో దృశ్యం సినిమా తరహాలో ఓ వ్యక్తిని హత్య చేశారు. రెండేళ్ల తర్వాత పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Satya Sai District | ఆంధ్ర ప్రదేశ్​ (AP)లో దృశ్యం సినిమా తరహా హత్య జరిగింది. ఓ వ్యక్తిని హత్య చేయగా.. రెండేళ్ల తర్వాత కేసు మిస్టరీ వీడింది.

తెలుగులో వెంకటేశ్ (Venkatesh)​, మీనా (Meena) జంటగా నటించిన దృశ్యం, దృశ్యం–2 సినిమాలు సూపర్​ హిట్​ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఓ యువకుడు వెంకటేశ్​ కూతురు స్నానం చేస్తుండగా వీడియో తీస్తాడు. ఆ తర్వాత ఆమె ఇంటికి వచ్చి బ్లాక్​మెయిల్​ చేస్తాడు. దీంతో మీనా ఆ యువకుడి తలపై కొట్టగా చనిపోతాడు. ఇలాగే బ్లాక్​మెయిల్​ చేసిన ఓ వ్యక్తిని మహిళ భర్త మరో ఇద్దరితో హత్య చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది.

Satya Sai District | మిస్సింగ్​ కేసు చేధించిన పోలీసులు

శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు పోలీస్​ స్టేషన్​ (Nalla Cheruvu PS) పరిధిలో 2023లో అమర్నాథ్‌ అనే వ్యక్తి అదృశ్యం అయ్యాడు. ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆయనకు సంబంధించిన వివరాలు ఎలాంటి క్లూ దొరకకపోవడంతో రెండేళ్లుగా కేసు అలాగే ఉండిపోయింది. ఇటీవల అమర్నాథ్​ హత్యకు గురయ్యాడని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Satya Sai District | అసలు ఏం జరిగిందంటే?

ఓ మహిళ స్నానం చేస్తుండగా అమర్నాథ్‌ వీడియో తీశాడు. అనంతరం కోరిక తీర్చాలని ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. లేదంటే వీడియో బయట పెడతానని బెదిరించాడు. ఈ వషయాన్ని సదరు మహిళ తన భర్తకు చెప్పింది. దీంతో ఆయన మరో ఇద్దరితో కలిసి అమర్నాథ్‌ను హత్య చేశాడు. అనంతరం నిందితులు మృతదేహాన్ని చర్లోపల్లి చెరువులో పడేశారు. తాజాగా పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు.

Related News