Homeబిజినెస్​Stock Market | మూరత్‌ రోజు స్మాల్‌ క్యాప్‌లో జోరు.. లాభాలతో ముగిసిన ప్రధాన సూచీలు

Stock Market | మూరత్‌ రోజు స్మాల్‌ క్యాప్‌లో జోరు.. లాభాలతో ముగిసిన ప్రధాన సూచీలు

దీపావళి(Diwali) పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం గంటపాటు ముహూరత్‌(మూరత్‌) ట్రేడింగ్ నిర్వహించారు. సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దీపావళి పండుగ సందర్భంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market)కు మంగళవారం సెలవు. అయినా ఆనవాయితీ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలనుంచి 2.45 గంటలవరకు గంటపాటు ముహూరత్‌ ట్రేడింగ్(Muhurat trading) నిర్వహించారు.

ఓ మోస్తరు లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్‌లో వొలటాలిటీ కనిపించింది. సెన్సెక్స్‌ 121 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 181 పాయింట్లు పెరిగింది. అయితే గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌(Profit booking)కు దిగడంతో 379 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 33 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే(Intraday) గరిష్టాలనుంచి 109 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్‌(Sensex) 62 పాయింట్ల లాభంతో 84,426 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 25,868 వద్ద స్థిరపడ్డాయి. 84,665 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌, 25,934 వద్ద నిఫ్టీ(Nifty) 52 వారాల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. ముహూరత్‌ ట్రేడింగ్ కావడంతో వాల్యూమ్స్‌ ఎక్కువగా నమోదు కాలేదు. ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌ వంటి స్టాక్స్‌ సూచీలను కిందికి లాగాలని చూసినా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(HDFC Bank), యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ వంటి హెవీవెయిట్‌ స్టాక్స్‌ మార్కెట్‌ను నిలబెట్టాయి.

Stock Market | రాణించిన టెలికాం, కమోడిటీ స్టాక్స్‌..

టెలికాం(Telecom), కమోడిటీ, ఇండస్ట్రియల్‌ సెక్టార్ల స్టాక్స్‌ రాణించాయి. బీఎస్‌ఈలో ఇండస్ట్రియల్‌ ఇండెక్స్‌ 0.53 శాతం, టెలికాం 0.51 శాతం, కమోడిటీ 0.47 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.40 శాతం, సర్వీసెస్‌ 0.38 శాతం, మెటల్‌ 0.37 శాతం, పవర్‌ 0.33 శాతం పెరిగాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.06 శాతం తగ్గగా.. బ్యాంకెక్స్‌, రియాలిటీ ఇండెక్స్‌లు స్వల్ప నష్టంతో ముగిశాయి. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ 0.91 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.23 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.08 శాతం లాభంతో ముగిశాయి.

Stock Market | అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 3,023 కంపెనీలు లాభపడగా 954 స్టాక్స్‌ నష్టపోయాయి. 201 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 174 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 42 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 17 కంపెనీలు లాభాలతో ఉండగా.. 13 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.42 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.80 శాతం, ఇన్ఫోసిస్‌ 0.72 శాతం, ఎంఅండ్‌ఎం 0.60 శాతం, టాటా మోటార్స్‌ 0.55 శాతం పెరిగాయి.

Top Losers : కొటక్‌ బ్యాంక్‌ 0.82 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.63 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.53 శాతం, ఎయిర్‌టెల్‌ 0.39 శాతం, మారుతి 0.26 శాతం నష్టపోయాయి.