అక్షరటుడే, ముప్కాల్: PRTU TS | ముప్కాల్ మండల (Mupkal mandal) పీఆర్టీయూ టీఎస్ నాయకులు రాష్ట్ర సంఘానికి ఎన్నికయ్యారు. ఈ మేరకు వారు శనివారం ప్రకటన విడుదల చేశారు.
ముప్కాల్ ఉన్నత పాఠశాలకి (Mupkal High School) చెందిన వన్నెల్ దాస్ నరేష్ (ఫిజిక్స్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా, తెడ్డు చిన్నయ్య (ఇంగ్లిష్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా, రెంజర్ల ఉన్నత పాఠశాలకు చెందిన సుద్దపల్లి మల్లేష్ (జీవ శాస్త్రం) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ఎన్నికకు కృషి చేసిన రాష్ట్ర, జిల్లా పీఆర్టీయూ టీఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పొద్దుటూరి మోహన్ రెడ్డి, గంగోని కిషన్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
PRTU TS | సమస్యల పరిష్కారానికి కృషి..
ఈ సందర్భంగా ఎన్నికైన పీఆర్టీయూ టీఎస్ నాయకులు (PRTU TS leaders) మాట్లాడుతూ.. సంఘం సహకారంతో రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పోరాడుతామన్నారు. జిల్లా ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి వెంట ఉంటామని స్పష్టం చేశారు.