అక్షరటుడే, ముప్కాల్ : Mupkal | జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లో (Hyderabad) ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు.
ఎల్బీ స్టేడియంలో (LB Stadium) నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ ‘ప్రతిభ పాటవ’ పరీక్షలో ఎం.నితిన్, ఎండీ. రేహనొద్దీన్ పాల్గొని 50/50 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ముప్కాల్ (Mupkal) పాఠశాల రాష్ట్రస్థాయిలో పేరు ప్రతిష్టలు గడించినట్లు పాఠశాల హెచ్ఎం ఎం.గంగారాం తెలిపారు.
Mupkal | రాష్ట్రం నలుమూలల నుండి..
ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుండి దాదాపు 1,710 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు ఎంపీ అనిల్ కుమార్, ఎమ్మెల్యే కాల్వ సుజాత, మాజీ జీహెచ్ఎంసీ మేయర్ బి.రామ్మోహన్, ఫౌండేషన్ ఛైర్మన్ రాజేందర్ చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ.5వేల నగదు బహుమతి, మెమెంటో, సర్టిఫికెట్లు, ఖాదీ వస్త్రాలు అందజేశారు. విద్యార్థుల విజయానికి గైడ్ టీచర్‌గా సుద్దపల్లి మల్లేశ్ మార్గనిర్దేశం చేశారు.