ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMunnurukapu Association | మున్నూరుకాపులు రాజకీయాల్లో రాణించాలి

    Munnurukapu Association | మున్నూరుకాపులు రాజకీయాల్లో రాణించాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Munnurukapu Association | మున్నూరు కాపులు రాజకీయాల్లో రాణించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవన్న(State Munnurukapu Association) అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local body elections) అన్ని స్థానాల్లో పోటీ చేయాలని సూచించారు. సభ్యుల గెలుపుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయన మంగళవారం మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ నివాసంలో నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. త్వరలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు.

    Munnurukapu Association | నాలుగు నియోజకవర్గాల్లో..

    జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల కార్య నిర్వహణ కమిటీ నియమించనున్నట్లు తెలిపారు. అనంతరం మండల, పట్టణ, గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శుల ఓటర్ ఐడీ కార్డులు ఇస్తామని దేవన్న పేర్కొన్నారు. తదనంతరం జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల జాబితాలను రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ (Apex Council) ఛైర్మన్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay), ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, గంగుల కమలాకర్, రవిచంద్రలు జాబితా పరిశీలిస్తారన్నారు. రిటైర్డ్ జడ్జిలతో (Retired judges) 119 నియోజకవర్గాల్లో ఒకేరోజు బ్యాలెట్ పత్రాలతో ఎక్కడికక్కడే ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

    Munnurukapu Association | 25వేల సంఘాలకు పైగా..

    రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేందుకు తెలంగాణలో 25వేలకు పైగా సంఘాల కమిటీ సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొంటారని చెప్పారు. త్వరలో కేంద్రం చేపట్టబోయే కులగణన సర్వేలో ప్రతి కాపులు పాల్గొనాలని సూచించారు. ఆగస్టు 30, 31 తేదీల్లో అమెరికాలో నిర్వహించే గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాస్, పెట్టిగాడి అంజయ్య, కోశాధికారి కుంటి ఆంజనేయులు, యూత్ అధ్యకుడు క్రాంతి, వెంకట్రాజం, లింగం, శ్రీధర్, బీమేష్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    More like this