అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం (Munnuru Kapu community) దుర్కి తర్ప–2 సభ్యులు బీజేపీ నాయకులను సన్మానించారు. బీజేపీ నాయకులు బంటు రాము (BJP leaders Bantu Ramu), నాంచారి యతిన్కృష్ణకు ఆదివారం సన్మానం చేశారు.
ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి ఎంపీ అర్వింద్ (MP Arvind) నిధులు మంజూరు చేయడంలో కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ పీర్ల శ్రీధర్, కోశాధికారి గోవింద్ గంగాధర్, పెద్ద కాపులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
