88
అక్షర టుడే, ఇందూరు: Munnuru Kapu Sangham | నగరంలోని విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం (Munnuru Kapu Sangham) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని ఖిల్లా రోడ్లో సోమవారం సమావేశం నిర్వహించారు.
Munnuru Kapu Sangham | సంఘ అధ్యక్షుడిగా కొరడి కిరణ్..
సంఘ అధ్యక్షుడిగా కొరడి కిరణ్ బాధ్యతలు చేపట్టారు. సంఘ నాయకులు (association leaders) ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అందరి భాగస్వామ్యంతో ముందుకెళ్తానని చెప్పారు. అలాగే పూర్వ అధ్యక్షులు సుంకేటి ప్రవీణ్ మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధిలో తనకు సహకరించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.