Munnuru Kapu Students | మున్నూరు కాపు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

అక్షరటుడే, ఇందూరు: Munnuru Kapu Students | మున్నూరు కాపు విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (MP Laxman) అన్నారు. తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత సంక్షేమ సంఘం (Telangana Munnuru Kapu Government Employees and Retired Welfare Association) ఆధ్వర్యంలో ఆదివారం పదో తరగతి (SSC), ఇంటర్​లో (INTER) ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మున్నూరు కాపు విద్యార్థులు […]

అక్షరటుడే, ఇందూరు: Munnuru Kapu Students | మున్నూరు కాపు విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (MP Laxman) అన్నారు. తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత సంక్షేమ సంఘం (Telangana Munnuru Kapu Government Employees and Retired Welfare Association) ఆధ్వర్యంలో ఆదివారం పదో తరగతి (SSC), ఇంటర్​లో (INTER) ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మున్నూరు కాపు విద్యార్థులు దేశానికి సేవ చేసేందుకు ముందుండాలన్నారు. చదువుతోపాటు అన్ని రంగాల్లో స్థిరపడాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం (BJP government) విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాపు కులస్థులు కేవలం వ్యవసాయం, రాజకీయాల్లోనే కాకుండా ఉన్నత పదవుల్లో రాణించాలన్నారు. అనంతరం 115 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు (BJP District President) దినేష్ కులాచారి, తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తోట రాజశేఖర్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస పటేల్, జిల్లా మున్నూరు కాపు సంఘం కోశాధికారి ధర్మపురి సురేందర్, నరాల రత్నాకర్, సంఘం ప్రధాన కార్యదర్శి అబ్బాపూర్ రవి, గౌరవాధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన సలహాదారు ఆకుల ప్రసాద్, రేంజర్ల నరేష్, హరిచరణ్, నారాయణ రెడ్డి, స్వర్ణలత, స్వప్న, పుష్పకుమారి, తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ex-railway-minister mukul roy | విషాదం.. గుండెపోటుతో రైల్వే మాజీ మంత్రి కన్నుమూత

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ex-railway-minister mukul roy | పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (71)...

Feb 23 Gold Prices | బంగారం, వెండి ధరలలో స్వల్ప తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా!

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 23 Gold Prices | బంగారం, వెండిధ‌ర‌లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ బంగారం ధరలు ఇంకా భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి....

Nepal accident | నేపాల్​లో ఘోర ప్రమాదం.. 18 మంది దుర్మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nepal accident | నేపాల్‌లోని ధాడింగ్ జిల్లా Dhading district గజురి Gajuri సమీపంలోని త్రిశూలి నది Trishuli river లో...

Feb 23 Pre Market Analysis | లాభాల్లో గ్లోబల్ క్యూస్.. భారీ గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: Feb 23 Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాల బాటలో సాగుతోంది. ఈ...