Homeజిల్లాలుకామారెడ్డిMunnuru kapu Sangham | మంత్రివర్గంలో మున్నూరుకాపులకు స్థానం కల్పించాలి

Munnuru kapu Sangham | మంత్రివర్గంలో మున్నూరుకాపులకు స్థానం కల్పించాలి

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Munnuru kapu Sangham | ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​కు (MLA Adi Srinivas) మంత్రి పదవి ఇవ్వాలని మున్నూరు కాపు కులస్థులు డిమాండ్​ చేశారు. కామారెడ్డి జిల్లా మున్నూరుకాపు సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆయా మండలాల ప్రతినిధులు గురువారం గాంధీభవన్​కు తరలివెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​కు(TPCC President Bomma Mahesh Kumar Goud) వినతిపత్రం అందజేశారు.

మంత్రివర్గంలో మున్నూరుకాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జయ ప్రదీప్, ఆయా జిల్లాలకు చెందిన సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Must Read
Related News