అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | నగరంలో మున్సిపల్ సిబ్బంది (Municipal staff) విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు.
పలు డివిజన్లలో బుధవారం ఉదయం 6 గంటలకు ఆకస్మిక పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ విధులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు.
Collector Nizamabad | సిబ్బందికి సామాగ్రి అందుబాటులో ఉందా..
మున్సిపల్ సిబ్బంది పనిచేసేందుకు సామగ్రి ఇస్తున్నారా లేదా.. అని కలెక్టర్ విచారించారు. ప్రతి ఉదయం క్రమతప్పకుండా సమయానికి విధుల్లో చేరాలని.. నిర్లక్ష్యం వహించవద్దని ఆయన సిబ్బందికి సూచించారు. నగరంలోని ఆర్యనగర్ (Arya nagar), బోధన్ రోడ్, ఖిల్లా రోడ్లో (Khilla Road) జరుగుతున్న శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. తనిఖీల్లో ఇన్ఛార్జి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రవిబాబు, సానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ, ఇన్స్పెక్టర్ మహిపాల్, సునీల్ జవాన్లు తదితరులు పాల్గొన్నారు.