అక్షరటుడే, ఇందూరు: Nizamabad Urban Constituency | ఇటీవల విడుదలైన మున్సిపల్ ఫండ్స్‌ను అర్బన్ నియోజకవర్గంలో సక్రమంగా వినియోగించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. నగరంలోని సమీకృత కార్యాలయాల భవనంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
ప్రధానంగా నగరంలో వీధిదీపాలు వెలగడం లేదని.. వెంటనే కొత్తలైట్లు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో (government schools) అవసరమైన అదనపు తరగతి గదుల నిర్మాణం, ఇతర సౌకర్యాలపై ప్రతిపాదనలు తక్షణమే అందజేయాలని తెలిపారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు ఆలస్యం అవుతున్నాయని, వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎల్లమ్మగుట్టలోని సోనీ ఫంక్షన్ హాల్ పక్కన బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
Nizamabad Urban Constituency | వైద్యశాఖలో పెండింగ్ పనులు..
వైద్యశాఖ (medical department) అధికారులకు ఎమ్మెల్యే, కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇటీవల వైద్యశాఖకు మంజూరైన రూ.2.25 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెండర్ ప్రక్రియను వేగవంతం చేసి పనులను ప్రారంభించాలన్నారు. అలాగే చెరువులు, కుంటలపై జరిగిన ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు.