అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. తమ వద్దకు వచ్చే ప్రజల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ ఆఫీసులో (Adibhatla Municipal Office) ఏసీబీ సోదాలు నిర్వహించింది. లంచం తీసుకుంటుండగా.. టీపీవో, అసిస్టెంట్ టీపీవోలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
ఇంటి పర్మిషన్ కోసం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (Town Planning Officer), అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఓ వ్యక్తిని లంచం అడిగారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బాధితుడి నుంచి డబ్బులు తీసుకుండగా.. ఏసీబీ అధికారులు ఇద్దరిని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ACB Raid | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
