119
అక్షరటుడే, బోధన్ : Bodhan | బోధన్ మున్సిపాలిటీలో (Bodhan Municipality) పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ కాలే మృతి చెందాడు.
అనారోగ్య కారణాలతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో (Nizamabad Government Hospital) చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం చనిపోయారు. ఆయన మృతిపై మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ సంతాపం తెలిపారు. ఆనంద్ మృతితో మున్సిపాలిటీలో విషాదఛాయలు అలుముకున్నాయి.