అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Municipal Elections Wine Shops | మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) వేళ మద్యంప్రియులకు షాక్ తగలనుంది. ఎన్నికల నియమావళిలో భాగంగా మద్యం షాప్‌లను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి (Excise Superintendent Mallareddy) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
Municipal Elections Wine Shops | ఎన్నికల నియమావళిలో భాగంగా..
మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation), మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం ఓటింగ్ ముగిసే వరకు వైన్‌షాప్‌లు, బార్లు, కల్లు దుకాణాలు, ఆర్మీ క్యాంటిన్, హరిత హోటల్లను మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటించాలని ఆయన సూచించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీ (Bheemgal Municipality) పరిధిలోని అని మద్యం సంబంధిత దుకాణాలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆయన తెలిపారు.