అక్షరటుడే, వెబ్‌డెస్క్: Municipal Elections Tensions | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పొలింగ్ కొనసాగుతోంది. మొత్తం 2,996 వార్డులు, డివిజన్లకు నోటిఫికేషన్ వెలువడగా.. 12 చోట్ల ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఒక వార్డులో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో మిగిలిన చోట్ల ఎన్నికలు కొనసాగున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Municipal Elections Tensions | కార్యకర్తల మధ్య ఘర్షణ
మెదక్ జిల్లా (Medak District) నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. చొక్కాలు పట్టుకుని ఇరు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. మహబూబాబాద్ (Mahabubabad)లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. 14వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు.
Municipal Elections Tensions | ఆగిన పోలింగ్
మహబూబ్‌నగర్ 45వ డివిజన్ 5వ బూత్‌లో దాదాపు 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తారుమారు అవడంతో పోలింగ్ ఆగిపోయింది. దీంతో అభ్యర్థులు కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు వారితో చర్చించి సమస్యను పరిష్కరించారు. దీంతో మళ్లీ ఓటింగ్ ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా లక్సేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9,10 పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్‌గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్‌ను బూత్ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Municipal Elections Tensions | ఓటు వేసిన ప్రముఖులు
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జెడ్పీ హైస్కూల్లో ఆయన ఓటు వేశారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా డెయిరీ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఓటు వేశారు.


1 comment
[…] […]
Comments are closed.