అక్షరటుడే, హైదరాబాద్: Municipal Elections | గ్రామ పంచాయతీ (Gram Panchayat) తోపాటుగా ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) స్థానాల ఎన్నికలకు ఇది వరకే షెడ్యూల్ విడుదలైంది.
మరోవైపు మున్సిపాలిటీ (municipalities) ల్లోనూ పాలక వర్గాల నియామకాలకు మున్సిపల్ శాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తవగానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంటే డిసెంబరు లేదా జనవరిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎలక్షన్స్ జరగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహణకు కావల్సిన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలతోపాటు గజ్వేల్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో వార్డుల విభజన ప్రక్రియ ప్రారంభించారు. ఈ వార్డుల విభజన ప్రక్రియ ప్రతిపాదనలను సర్కారుకు పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Municipal Elections | వాటికి మినహాయింపు
తెలంగాణ వ్యాప్తంగా 16 కార్పొరేషన్లు, 160 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ ఆర్) పరిధిలో 27 మున్సిపాలిటీలు ఉండేవి. వీటిని జీహెచ్ఎంసీలో కలిపేశారు.
జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం ఉంది. మరో 10 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలానికి గడువు ఇంకా పూర్తి కాలేదు. ఇక రాష్ట్రంలోని మిగతా 123 మున్సిపాలిటీల పాలకవర్గాల ఎన్నికకు ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంది.
Municipal Elections | రిజర్వేషన్ల ప్రక్రియ
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను డెడికేటెడ్ కమిటీ ఖరారు చేయనుంది. ఇందుకు సర్కారు చేపట్టిన కులగణన వివరాలను ప్రామాణికంగా తీసుకోనుంది. ఈ ప్రాసెస్ కూడా వచ్చే నెలాఖరు వరకు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.