అక్షరటుడే, వెబ్‌డెస్క్: Municipal Elections Police Security | మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. 25 వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికలపై ఏర్పాట్లపై డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivdhar Reddy) మంగళవారం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) 25 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం 8,189 పోలింగ్ కేంద్రాలు, 133 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
Municipal Elections Police Security | అక్కడ ప్రత్యేక నిఘా
రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను (Polling Centers) పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఆయా కేంద్రాల్లో పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తామన్నారు. హైపర్ సెన్సిటీవ్ కేంద్రాల్లో బయట కూడా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో 1,183 లైసెన్స్ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 4,800 మంది బైండోవర్ చేశామని, ఇందులో 2,900 మంది రౌడీ షీటర్లు ఉన్నారని వెల్లడించారు.
Municipal Elections Police Security | విచారణ చేస్తున్నాం
నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం (Fire Accident)పై డీజీపీ స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ కేసు 2015లో ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించామని, ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని పరిశీలించి నివేదికలు ఇచ్చామన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వర్ రూంలు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ సర్వర్లకు బ్యాకప్ లేదని చెప్పారు.మక్తల్ బీజేపీ అభ్యర్థి (Maktal BJP Candidate) మహదేవప్ప ఆత్మహత్యపై డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు. ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ లేదన్నారు. వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.