అక్షరటుడే, హైదరాబాద్: Municipal elections | తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగబోతోంది. 2026 ఫిబ్రవరిలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్‌తోపాటు మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, రామగుండం, కరీంనగర్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మే నె ల చివరి నాటికి GHMC, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు సైతం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల గెజిట్ వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే తెలంగాణలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం (డిసెంబర్ 29) అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉన్న ఓటర్ల జాబితా (01.10.2025 నాటి డేటా) ప్రకారం మున్సిపల్ వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.
Municipal elections | 1న ముసాయిదా ఓటర్ల జాబితా..
జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, సవరణలు ఉంటే స్వీకరిస్తారు. తర్వాత జనవరి 10, 2026న తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితా ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఉంటుంది.