5
అక్షరటుడే, ఇందూరు: municipal elections counting | మున్సిపల్ పోలింగ్ ముగిసింది. రేపు (శుక్రవారం) కౌంటింగ్ ఉండనుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లను గురువారం రాత్రి డీసీపీ బస్వారెడ్డి పర్యవేక్షించారు. పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కళాశాల చుట్టూ గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. అనంతరం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో బి ప్రకాష్, శ్రీనివాస్ రాజ్ టౌన్ సీఐ, 3 టౌన్ SI లు హరి బాబు, నారాయణ, డివిజన్ లోని CI లు SI లు, ASI, HC, PC HG లు 250 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు.
municipal elections counting | కీలక సూచనలు ఇవే..
- కౌంటింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తమ వాహనాలను పాలిటెక్నిక్ మైదానంలో పార్క్ చేయాలి.
- అభ్యర్థులు, వారి అధికారిక ఏజెంట్స్ (ఎలెక్షన్ అధికారి జారీ చేసిన పాసులు ఉన్న వారికి మాత్రమే) తమ వాహనాలను CSI గ్రౌండ్లో పార్క్ చేయాలి. కౌంటింగ్ కేంద్రం లోకి నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది.
- ఎలెక్షన్ అధికారి జారీ చేసిన పాసులు ఉన్న విలేకరులకు మాత్రమే మీడియా పాయింట్ (పాలిటెక్నిక్ కాలేజీలోకి) వరకు అనుమతి కలదు. కౌంటింగ్ హాల్ లోకి ఉండదు.
- పాలిటెక్నిక్ కాలేజీలోకి సెల్ ఫోన్లకు అనుమతి లేదు.
- పాలిటెక్నిక్ కళాశాల చుట్టూ 163 BNSS అమలులో కలదు. గుంపులు గుంపులుగా తిరగరాదు. చుట్టూ వున్న దుకాణాలు ఓపెన్ చేయరాదు.
- పాలిటెక్నిక్ కళాశాల పరిసరాలలో రోడ్డు పైన రాకపోకలు నిషేధం.
- కాలేజీలో మార్నింగ్ వాక్ కు అనుమతి లేదు.
- ఎలెక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఎవరూ ర్యాలీలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు చేయకూడదు.
- ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి నట్లయితే చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకొనబడతాయి.