అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | మున్సిపల్ ఎన్నికల్లో (municipal elections) సత్తా చాటాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కార్యకర్తలకు సూచించారు. మెజారిటీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో (panchayat elections) గెలిచి పట్టు సాధించామని సీఎం అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. మరో 8 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పారు. స్థానిక సంస్థల్లో పట్టు ఉంటేనే అభివృద్ధి చేయగలమన్నారు.
CM Revanth Reddy | ప్రమాదంలో ప్రజాస్వామ్యం
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేసిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ప్రజలను అప్రమత్తం చేశారని చెప్పారు. అందుకే 2024 ఎన్నికల్లో బీజేపీ 240 సీట్ల దగ్గర ఆగిపోయిందన్నారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని ఆరోపించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తానని ప్రకటించి ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
CM Revanth Reddy | సర్పంచులు తీర్మానం చేయాలి
జాతీయ ఉపాధి హామీ పథకం రూపురేఖలను మార్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామని సీఎం తెలిపారు. 12 వేల మంది సర్పంచులు కూడా తీర్మానం చేయాలన్నారు. 15 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న మంత్రులు ఇన్ఛార్జీలుగా వేయాలని పీసీసీని ఆదేశించారు. ఈ నెల 20 నుంచి 30 వరకు ఒక్కొక్క మండలానికి ఒక్కరు బాధ్యత తీసుకొని గ్రామ సభలు నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రిగా తాను కూడా ఒక మండలానికి బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు.
CM Revanth Reddy | బానిసలు చేయడానికి..
వీబీ జీ రామ్ జీలో వికసిత్ భారత్ ఎక్కడ ఉందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సంక్షోభ భారత్‌ను సృష్టిస్తున్నారని విమర్శించారు. పేదలను బానిసలను చేయడానికి కొత్త చట్టం తెచ్చారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకూ పోరాటం చేస్తామన్నారు. పేదల మీద కక్షతో ఈ పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.