అక్షరటుడే, కామారెడ్డి: Municipal Elections | కామారెడ్డి జిల్లాలో రెండో రోజు నామినేషన్ల జోరు కొనసాగింది. మొదటిరోజు మందకొడిగా సాగిన నామినేషన్ల ప్రక్రియ గురువారం పుంజుకుంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో మొత్తం 348 నామినేషన్లు దాఖలయ్యాయి.
కామారెడ్డి మున్సిపాలిటీలో 203, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 24, బాన్సువాడ మున్సిపాలిటీలో 87, బిచ్కుంద మున్సిపాలిటీలో 34 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కామారెడ్డి మున్సిపాలిటీలో బీజేపీ నుంచి 51, సీపీఐఎం 01, కాంగ్రెస్ 86, ఎంఐఎం 01, బీఆర్ఎస్ పార్టీ నుంచి 45, గుర్తింపు పొందిన ఇతర పార్టీల ద్వారా 8 తోపాటు, స్వతంత్ర అభ్యర్ధులు 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
Municipal Elections | రేపే చివరి రోజు..
ఇక బాన్సువాడ మున్సిపాలిటీలో బీజేపీ నుంచి 12, కాంగ్రెస్ నుంచి 54, ఎంఐఎం నుంచి 01, బీఆర్ఎస్ నుంచి 20 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా గత రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 370 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.