అక్షరటుడే, కామారెడ్డి: Municipal Elections | కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో మూడు రోజుల వ్యవధిలో అభ్యర్థుల నుంచి 1,005 నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో 527, ఎల్లారెడ్డిలో 88, బాన్సువాడలో 250, బిచ్కుంద మున్సిపాలిటీలో 140 నామినేషన్స్ దాఖలయ్యాయి. కాగా శనివారం వీటికి స్క్రూటినీ చేపట్టారు.
స్క్రూట్నీలో 296 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. స్క్రూటినీ తర్వాత కామారెడ్డి మున్సిపాలిటీలో 340 మంది అభ్యర్థులకు సంబంధించి 341 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ 01, బీఎస్పీ BSP 01, బీజేపీ BJP 58, సీపీఐఎం CIPM 03, కాంగ్రెస్ 129, ఎంఐఎం MIM 08, బీఆర్ఎస్ BRS 83, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 18, స్వతంత్ర అభ్యర్ధులకు సంబంధించి 40 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి.
Municipal Elections | ఇతర మున్సిపాలిటీల్లో..
ఎల్లారెడ్డిలో 72 మంది 75 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో బీఎస్పీ 2, బీజేపీ 14, కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 24, స్వతంత్ర అభ్యర్ధులు 09 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి.
బాన్సువాడలో 158 మంది అభ్యర్థులు 176 నామినేషన్లు వేయగా.. బీజేపీ 22, కాంగ్రెస్ 98, ఎంఐఎం 01, బీఆర్ఎస్ 40, స్వతంత్ర అభ్యర్ధులకు సంబంధించిన 15 నామినేషన్లు సరిగా ఉన్నట్లు గుర్తించారు.
బిచ్కుంద మున్సిపాలిటీలో 108 మంది 117 నామినేషన్లు వేయగా.. ఇందులో బీఎస్పీ 01, బీజేపీ 21, కాంగ్రెస్ 32, ఎంఐఎం 01, బీఆర్ఎస్ 26, ఇతర పార్టీలు 03 స్వతంత్రులకు సంబంధించిన 33 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి.
నాలుగు మున్సిపాలిటీలలో 92 వార్డులలో ప్రధాన పార్టీలైన బీజేపీ నుంచి 115, కాంగ్రెస్ నుంచి 285, బీఆర్ఎస్ నుంచి 173 నామినేషన్లు ఉన్నాయి. రేపు అభ్యంతరాలు స్వీకరించనుండగా ఇక ఉపసంహరణ మాత్రమే మిగిలి ఉంది.
ఫిబ్రవరి 3 వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉండగా.. ప్రధాన పార్టీలలో వార్డులకు మించి నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఎవరి చేతికి బీ ఫారాలు చేరి బరిలో ఉంటారు..? ఉపసంహరించుకునేది ఎవరు..? రెబల్స్ ఎవరనేది 3 వ తేదీన తేలనుంది.