అక్షరటుడే, హైదరాబాద్: Municipal Election Results | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్రంలో మొత్తం 2,996 వార్డుల్లో పోటీ చేసిన 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కా ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఇప్పటికే భారీగా మోహరించారు. సామాన్యులను ఎవరినీ పరిసరాల్లోకి అనుమతించడం లేదు. ఎన్నికల అధికారులు జారీ చేసిన పాసులు ఉన్నవారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరూ ర్యాలీలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
Municipal Election Results |
తెలంగాణ వ్యాప్తంగా 136 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభం కానుంది. వెయ్యి ఓట్లకు ఒక రౌండ్గా లెక్కింపు ఉంటుంది. ఫలితాల విషయానికి వస్తే.. కార్పొరేషన్లలో 7-8 రౌండ్లు, మున్సిపాలిటీల్లో 3 – 4 రౌండ్లలో లెక్క తేలనుంది.
వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ
- కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
- సరిగ్గా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్ల లెక్కింపు చేపడతారు.
- ఒక వార్డులోని బ్యాలెట్ బాక్సులను అన్నింటిని కౌంటింగ్ టేబుల్ వద్దకు చేర్చుతారు. 25 ఓట్ల చొప్పున బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కడతారు.
- వార్డులోని ఓట్ల కట్టలను ఒకే డ్రమ్ములో వేసి మిక్స్ చేస్తారు. దీనివల్ల ఏ పోలింగ్ కేంద్రాల్లో ఎవరికి ఎక్కవ ఓట్లు వచ్చాయనే విషయం తెలియకుండా ఉంటుంది. అందుకే ఈ విధంగా చేస్తారు. ఆ తర్వాత డ్రమ్ నుంచి 40 కట్టలు తీసి కౌంటింగ్ టేబుల్ వద్దకు పంపుతారు.
- ప్రతి అభ్యర్థికి ఒకటి, నోటాకు ఒకటి, చెల్లని ఓట్లకు ఒకటి ట్రే ఉంచుతారు. బ్యాలెట్ పేపర్లను ఏజెంట్లకు చూపిస్తూ.. వచ్చిన ఓట్లను వచ్చినట్లుగా ఆయా ట్రేల్లో వేస్తారు.
1 comment
[…] […]
Comments are closed.