అక్షరటుడే, హైదరాబాద్: Municipal Election Results | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. రాష్ట్రంలో మొత్తం 2,996 వార్డుల్లో పోటీ చేసిన 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కా ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. సామాన్యులను ఎవరినీ పరిసరాల్లోకి అనుమతించడం లేదు. ఎన్నికల అధికారులు జారీ చేసిన పాసులు ఉన్నవారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరూ ర్యాలీలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
Municipal Election Results | పోస్టల్ బ్యాలెట్‌తో..
తెలంగాణ వ్యాప్తంగా 136 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభం అయింది. వెయ్యి ఓట్లకు ఒక రౌండ్‌గా లెక్కింపు చేపడుతున్నాఆరు. ఫలితాల విషయానికి వస్తే.. మధ్యాహ్నం వరకల్లా మున్సిపాలిటీల్లో, సాయంత్రానికల్లా కార్పొరేషన్లలో 7-ఫలితాలు వెలువడనున్నాయి.
Municipal Election Results మొదటి రౌండ్లోనే..
అలంపూర్ మున్సిపాలిటీ ఫలితాలు మొదటి రౌండ్లోనే వెలువడనున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏడు వేల ఒక వంద నాలుగు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఒక్కో మున్సిపాలిటీకి పది టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్ మీద వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కన అలంపూర్ ఫలితాలు ఒక్క రౌండ్లోనే వెలువడనున్నాయి.
1 comment
[…] Armoor Postal Ballot Results | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Election) భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ […]
Comments are closed.