అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Municipal elections | రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మున్సిపల్ ఎన్నికలు (municipal elections) నిర్వహించనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల ఓటరు జాబితా ముసాయిదాను ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసింది. దానిపై అభ్యంతరాలు స్వీకరిస్తోంది. గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. అభ్యంతరాల సవరణ అనంతరం తుది ఓటరు జాబితాను (final voter list) ఈ నెల 12న అధికారులు విడుదల చేయనున్నారు. 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేస్తారు. 16న తుది జాబితా ప్రకటిస్తారు. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Municipal elections | సంక్రాంతి తర్వాత..
రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు బ్యాలెట్ బాక్స్‌లు (ballot boxes) సిద్ధం చేసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. అయితే సంక్రాంతి (Sankranthi) అనంరతం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో పోలింగ్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Municipal elections | రిజర్వేషన్లు తేలాకే..
మున్సిపాలిటీల్లోని వార్డులు, బల్దియా ఛైర్పర్సన్ పదవులకు ఇంకా రిజర్వేషన్ ఖరారు కాలేదు. తుది ఓటరు జాబితా ప్రకటన అనంతరం రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉంది. రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 10 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.