అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి : Municipal Counting Arrangements | మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడిజిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ (Nizamabad) నగరానికి సంబంధించి పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. కామారెడ్డికి సంబంధించి పట్టణంలోని ఏఎంసీ గోదాంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటైంది.
Municipal Counting Arrangements | నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలోని నగరపాలక సంస్థతో పాటు ఆర్మూర్ భీమ్‌గల్, బోధన్ మున్సిపాలిటీ (Bodhan Municipality)ల లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. నగరానికి సంబంధించి పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఇందుకోసం 60టేబుళ్లను, 230 మంది సిబ్బందిని నియమించారు. అలాగే బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి విజయ్ మేరీ పాఠశాలలో లెక్కింపు జరగనుంది. ఇందుకోసం 38 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్మూర్‌లో 36 టేబుళ్లు, 130 మంది సిబ్బందిని నియమించారు. ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College)లో ఏడు గదుల్లో 36 టేబుళ్లు ఏర్పాటు చేసి 150మందిని నియమించారు. అలాగే భీమ్‌గల్‌లో 12 టేబుళ్లు ఏర్పాటయ్యాయి. తొలి గంటలోనే మూడు మున్సిపాలిటీల ఫలితాలు తేలనన్నట్లు తెలుస్తోంది. నగరపాలక సంస్థ ఫలితాలు మాత్రం నాలుగు రౌండ్లలో తేలనున్నాయి.
Municipal Counting Arrangements | కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality)కి సంబంధించి ఎస్పీ కార్యాలయ సమీపంలో ఉన్న ఏఎంసీ గోదాంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం ఎన్నికలు ముగియగానే బ్యాలెట్ బాక్సులను పోలీసుల భద్రత మధ్య కౌంటింగ్ కేంద్రానికి తరలించిన అధికారులు కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
Municipal Counting Arrangements | 32 టేబుళ్లు ఏర్పాటు..
ఈ మేరకు కౌంటింగ్ కేంద్రంలో 32 టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో టేబుల్‌కు ఒక ఆర్వో, ఒక సూపర్వైజర్, ఇద్దరు సిబ్బందితో పాటు మరొకరిని అదనంగా ఏర్పాటు చేశారు. అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యాహ్నం వరకు తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలలోపు లెక్కింపు పూర్తిచేసి ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గోదాం వద్ద పోలీసుల భారీ బందోబస్తు కొనసాగుతోంది.
Municipal Counting Arrangements | ట్రాఫిక్ మళ్లింపు..
మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) కౌంటింగ్ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైల్వేగేటు నుంచి అడ్లూర్ వెళ్లే దారిలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే మూలమలుపు నుంచి కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. అలాగే రామారెడ్డి రోడ్డు గుమస్తా కాలనీ నుంచి ఎస్పీ కార్యాలయం వైపు వచ్చే రహదారిలో వాహనాల రాకపోకలకు నిలిపివేసామన్నారు. కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి అడ్లూర్ వెళ్లే దారి, కామారెడ్డి నుంచి గర్గుల్, రామారెడ్డి వెళ్లే రహదారిపై రాకపోకలు ఎప్పటిలాగే కొనసాగుతాయని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ మళ్లించిన ప్రాంతాల నుంచి వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు.
