అక్షరటుడే, బోధన్: Bodhan Municipality | బోధన్ మున్సిపల్ కమిషనర్ గురువారం ఉదయం పట్టణంలోని కాలనీల్లో పర్యటించారు. పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. మున్సిపల్ సిబ్బందికి (municipal staff) పలు సూచనలు చేశారు.
Bodhan Municipality | విధుల్లో చేరిన కృష్ణ జాదవ్
ఇటీవల సస్పెన్షన్కు గురైన బోధన్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ (Municipal Commissioner Krishna Jadhav) గురువారం విధుల్లో చేరారు. అయితే ఆదిలాబాద్లో రెవెన్యూ అధికారిగా పనిచేసిన సమయంలో పలు ఆరోపణలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వీటిని సంబంధించి ఆయనను ఉన్నతాధికారులు ఇటీవల సస్పెండ్ చేశారు. కాగా.. ఆరోపణలు అవాస్తమని విచారణలో తేలిన తర్వాత తిరిగి బోధన్ కమిషనర్గా ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. దీందో ఆయన గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన పట్టణంలో పారిశుధ్య పనులను పర్యవేక్షించారు.