అక్షరటుడే, వెబ్‌డెస్క్: Municipal Chairperson Elections Tension | మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నికలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రాష్ట్రంలో మొత్తం 34 మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చిన విషయం తెలిసిందే. హంగ్ వచ్చిన పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. తొర్రూరు మున్సిపల్ కార్యాలయం (Thorrur Municipal Office) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యాకర్తలు పరసర్పం దాడులు చేసుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao)ను పోలీసులు నిర్బందించారు. కాగా ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఓ అభ్యర్థి కాంగ్రెస్‌కు మద్దతు తెలిపాడు.
Municipal Chairperson Elections Tension | ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ అభ్యర్థి కనిపించకుండా పోవడంతో ఆయన అనుచరులు మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలు పగులకొట్టారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ పత్య నాయక్ (BRS Councilor Patya Nayak) అమ్ముడు పోయాడు అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఛైర్మన్ పీఠం దక్కకుండా కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. మరోవైపు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. బీఆర్ఎస్కు పదవి దక్కకుండా మంత్రి వివేక్ వెంకటస్వామి కుట్ర చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Municipal Chairperson Elections Tension | కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు
మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. నిత్యం విమర్శలు చేసుకునే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పలు చోట్ల జత కట్టాయి. మేడ్చల్ జిల్లా అలియాబాద్‌లో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 20 వార్డులు ఉండగా.. 8 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 3 బీజేపీ, ఒక స్థానంలో ఇతరులు విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి, బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ పీఠాన్ని దక్కించుకుంది. మరోవైపు కామారెడ్డి (Kamareddy)లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై ఛైర్పర్సన్, డిప్యూటీ ఛైర్పర్సన్ పదవులను దక్కించుకున్నాయి.
Municipal Chairperson Elections Tension | ఒకే కారులో వచ్చి..
ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao), ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరు అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ ఒకే కారులో రావడ గమనార్హం.
Municipal Chairperson Elections Tension | కరీంనగర్ బీజేపీదే..
కరీంనగర్ మేయర్ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వ్యూహాత్మకంగా వ్యవహరించి కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్నారు. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మరోవైపు నారాయణపేట మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ సభ్యులు హాజరు కాకపోవడంతో బీజేపీ ఛైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది.