భీమ్గల్, అక్షరటుడే: Municipal Bheemgal Polling | భీమ్గల్ మున్సిపాలిటీలోని (Bheemgal Municipality) 12 వార్డులకు బుధవారం జరిగిన రెండో సాధారణ (Nizamabad Municipal Elections) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరగా, సాయంత్రం 5 గంటల వరకు ప్రక్రియ కొనసాగింది. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేశారు.
Municipal Bheemgal Polling | వివిధ ప్రాంతాల నుంచి..
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తిస్తూ దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సైతం తరలివచ్చారు. ముంబై, హైదరాబాద్(Hyderabad) వంటి నగరాల నుంచి ఓటర్లు వచ్చి తమ హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా ముంబై నుంచి వచ్చిన విజయ-సంగీత దంపతులు మాట్లాడుతూ.. ఏ ఎన్నికలు వచ్చినా తమ సొంత గడ్డపై ఓటు వేయడం బాధ్యతగా భావిస్తామని తెలిపారు.
అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు
పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నప్పటికీ కొన్ని వార్డుల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పట్టణంలోని 4వ వార్డు బాలికల ఉన్నత పాఠశాల కేంద్రం వద్ద ఓ అభ్యర్థి డబ్బులు పంచుతున్నారని మరో అభ్యర్థి ఆరోపించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగగా, పోలీసులు (Bheemgal Police) రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు.